వరుసగా మూడో సారి చెన్నై ఓటమి.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

Sat Apr 01 2023 11:09:53 GMT+0530 (India Standard Time)

Chennai Super Kings defeat in the first match of IPL

ఐపీఎల్ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ప్రారంభించింది. ఈ సీజన్  తొలి మ్యాచ్ లో కూడా హిస్టరీ రిపీట్ అయ్యింది. గత ఏడాది అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ ను చెన్నై ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. గత ఐనీఎల్ లో ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడ్డాయి.ఈ రెండు మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన గుజరాత్ విజయాలు నమోదు చేసింది. ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని.. కొత్త సీజన్ ను విజయంతో మొదలుపెట్టాలని చెన్నై భావించింది.  కానీ చెన్నై అంచనాలు తలకిందులయ్యాయి.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి తన సత్తా చూపించాడు. మణికట్టు గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన అతడు ఈ మ్యాచ్ లో 50 బంతుల్లోనే 92 పరుగులతో ఆకట్టుకున్నాడు. గుజరాత్ పై రుతురాజ్ కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం.

గత ఏడాది ఆడిన రెండు మ్యాచుల్లో కూడా రుతురాజ్ హాఫ్ సెంచరీలతో రాణించాడు.  కానీ ఆ రెండు మ్యాచుల్లో కూడా మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. దీంతో చెన్నై అనుకున్న స్కోరు చేయలేక పెవిలియన్ కు చేరింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపిట్ అయ్యింది.

గైక్వాడ్ మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. చివర్లో ఒక సిక్స్ ఒక ఫోర్ బాదాడు. దీంతో చెన్నై 178/7 స్కోరు చేసింది. మ్యాచ్ ఆరంభంలోనే రుతురాజ్ బ్యాటింగ్ చూసి ఆ జట్టు 200 స్కోరు దాటుతుందని అనుకున్న ఫ్యాన్స్అంతా చాలా డిసాప్పాయింట్ అయ్యారు.

చెన్నైలో అద్భుతమైన బౌలర్లు కూడా లేరు. అరంగేట్ర బౌలర్ రాజ్ వర్ధన్ హంగ్రేకర్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. మిగతా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. గుజరాత్ లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. గిల్ సహా గుజరాత్ బ్యాట్స్ మెన్ రాణించడంతో చెన్నైపై విజయం సాద్యమైంది. చివర్లో ఫోర్లు సిక్స్ తో రషీద్ ఖాన్ గుజరాత్ ను గెలిపించాడు.

ఇలా వరుసగా మూడోసారి గుజరాత్ చేతిలో చెన్నై ఓటమి పాలైంది. ఐపీఎల్ లో హిస్టరీ రిపీట్ అయ్యింది.