Begin typing your search above and press return to search.

ఓపక్క ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. మరోవైపు కండోమ్ లకు భారీ గిరాకీ

By:  Tupaki Desk   |   30 May 2023 10:51 AM GMT
ఓపక్క ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. మరోవైపు కండోమ్ లకు భారీ గిరాకీ
X
ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడటం తెలిసిందే. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రెండోసారి బ్యాటింగ్ షురూ చేసిన చెన్నై జట్టు మూడు బంతులు ఎదుర్కొనేసరికి.. వర్షం రావటం.. దాదాపు రెండున్నర గంటలపాటు మ్యాచ్ నిలిచిపోవటం తెలిసిందే.

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ కారణంగా నగరంలో సందడి వాతావరణం నెలకొంది. ఎంతోమంది క్రికెట్ అభిమానులు దేశంలోని నలుమూలల నుంచి అహ్మదాబాద్ కు రావటం తెలిసిందే.

ఓవైపు స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న వేళ.. ఫైనల్ పోరుకు వేదికగా నిలిచిన అహ్మదాబాద్ నగరంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోవటం విశేషం. ఆ విషయాన్ని ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ట్వీట్ రూపంలో వెల్లడించింది. సోమవారం రాత్రి 8.30 గంటల వరకు 2324 కండోమ్స్ ను తాము డెలివరీ చేసినట్లుగా స్విగ్గీ వెల్లడించింది. దీనిపై ఒక ట్వీట్ చేసింది.

'చూస్తుంటే.. 22 మంది ప్లేయర్ల కంటే ఎక్కువ మందే ఈ రాత్రికి మ్యాచ్ లను ఆడేట్లుగా కనిపిస్తోంది' అంటూ వ్యాఖ్యానించింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు తమదైన శైలిలోరియాక్టు అవుతున్నారు. ప్లాట్ పిచ్ పై నాన్ స్టాప్ బ్యాటింగ్ చేస్తున్నారని కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. మరికొందరు స్విగ్గీ ఈ పోస్టు ను ప్రముఖ కండోమ్ కంపెనీ డ్యూరెక్స్ ను కోట్ చేసిన వైనంపై ప్రశ్నలు వేస్తున్నారు.

వాళ్లు వాళ్ల లక్ష్యాల మీద గురి పెడుతున్నారని ఒకరు.. ల్యుబ్రికెంట్ మీద ఏమైనా అప్డేట్ ఉందా? అని ఇంకొకరు, చూస్తుంటే మరో తొమ్మిది నెలల్లో చాలామంది ట్రోఫీలు తీసుకోవటానిక సిద్ధం అవుతున్నారంటూ కామెంట్స్ పోస్టు చేశారు.

స్విగ్గీ చేసిన కండోమ్ పోస్టు వైరల్ గా మారింది. ఇక.. మరో ట్వీట్ లో ఐపీఎల్ సీజన్ మొత్తానికి తమకు 3.68 లక్షల జిలేబీ పాపడ్ల ఆర్డర్లు లభించాయని పేర్కొంది. ఈ ఆర్డర్లు ఎక్కువగా గోకుల్ ధామ్ నుంచే వచ్చినట్లుగా పేర్కొంది. గుజరాతీయులు బాగా ఇష్టపడే స్నాక్స్ లో జిలేబీ పాపడ్ ముందు ఉంటుందని చెబుతారు.