చంపి వారి రక్తంతో శివుడికి అభిషేకం .!?

Mon Jul 15 2019 19:35:17 GMT+0530 (IST)

అనంతపురం జిల్లాలోని ఓ శివాలయంలో ముగ్గురి హత్య కలకలం రేపుతోంది. వీరిని   నరబలి ఇచ్చి చంపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. హత్య చేసిన తర్వాత వారి రక్తంతో శివుడికి అభిషేకం చేసిన తీరు చూసి ఇది ఖచ్చితంగా నరబలినే అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన అందరినీ భయకంపితులను చేస్తోంది.అనంతపురం జిల్లా తనకల్ల మండలం కొర్తికోటలో ఈ దారుణం వెలుగుచూసింది. కోర్తికోటలోని పురాతన శివాలయాన్ని పునర్మించేందుకు రిటైర్డ్ టీచర్ శివరామిరెడ్డి (75) ముందుకువ్చాడు. శిథిలమైన ఈ ఆలయాన్ని తన సోదరి కమలమ్మ బెంగళూరు వాసి సత్యలక్ష్మి సాయంతో పునర్మిస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి శివరామిరెడ్డి- సత్యలక్ష్మి-  కమలమ్మ ఆలయంలోనే పడుకున్నారు.

అయితే అర్థరాత్రి దాటాక దుండగులు వచ్చి వీళ్లను బండరాళ్లతో కొట్టి చంపారని పోలీసులు గుర్తించారు. వీరి రక్తంతో ఆలయంలోని శివుడికి అభిషేకం చేసిన ఆనవాళ్లను గుర్తించారు. అనంతరం అదే రక్తాన్ని ఆలయ సమీపంలోని పాము పుట్టల్లో కూడా రక్తాన్ని పోసినట్టు నాగదేవతకు పూజలు చేసినట్టు పోలీసులు గుర్తించారు.. గుప్త నిధుల కోసమే ఇక్కడ చాలా రోజులుగా తవ్వకాలు- క్షుద్రపూజలు జరుగుతున్నాయని.. ఆ కోవలోనే వీరి ముగ్గుని నరబలిచ్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.

గగుర్పొడిచేలా ఈ మూడు హత్యలు జరగడం అనంతపురం జిల్లాలో అందరినీ భయాందోళనకు గురిచేసింది. నరబలి ఇచ్చారనే కోణంలోనే పోలీసులు రంగంలోకి దిగి క్షుద్రపూజలు చేసే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని తెలిసింది.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ ముగ్గురి హత్య కేసులో ఇప్పటివరకు ఎవరిని నిందితులుగా గుర్తించలేదు.. అరెస్ట్ చూపించలేదని తెలిసింది.