Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ వారసురాలు. ఆ వివాదమే మచ్చ

By:  Tupaki Desk   |   27 March 2023 5:00 PM GMT
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ వారసురాలు. ఆ వివాదమే మచ్చ
X
బీజేపీ రాజకీయాల్లో పెద్దమ్మగా.. అందరికీ చేరువగా హుందాగా వ్యవహరించిన అతి కొద్దిమంది నాయకుల్లో సుష్మా స్వరాజ్ ఒకరు. విదేశాంగ మంత్రిగా ఆమె వ్యవహరించిన తీరు ఇటు స్వదేశంతోపాటు పాకిస్తాన్ లోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించిపెట్టింది. అయితే ఆమె అనారోగ్య సమస్యలతో 2019 ఆగస్టు 6న 67 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

సుష్మా స్వరాజ్ వారసురాలు ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగులు పెడుతున్నారు. ఆమె కుమార్తె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. బీజేపీ ఢిల్లీ లీగల్ సెల్ కో-కన్వీనర్‌గా విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్ నియమితులయ్యారు.

బాన్సురి స్వరాజ్ న్యాయవాద వృత్తిలో ఉన్నారు. అనుభవం ఉన్న న్యాయవాది. ఆమె యూనివర్శిటీ ఆఫ్ వార్విక్ నుండి ఇంగ్లీష్ లిటరేచర్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని, లండన్‌లోని బిపిపి లా స్కూల్ నుండి లా డిగ్రీని పొందింది.

ఆమె న్యాయవాదిగా కూడా అర్హత సాధించింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తన మాస్టర్ ఆఫ్ స్టడీస్‌ను పూర్తి చేసింది.

తన వృత్తి జీవితంలో బన్సూరి స్వరాజ్ వివిధ న్యాయపరమైన ఫోరంలలో వివాదాస్పద వ్యాజ్యంలో ఉన్నత-ప్రొఫైల్ కేసులను డీల్ చేశారు.

ఆమె ఒప్పందాలు, రియల్ ఎస్టేట్, పన్ను, అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వాలు, అలాగే అనేక నేర విచారణలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించింది.

అయితే పలు వివాదాల్లోనూ బాన్సురీ పేరు వినిపించింది. ముఖ్యంగా ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి పాస్ పోర్ట్ తిరిగి ఇప్పించడంలో సాయం చేశారని బాన్సురిపై విమర్శలున్నాయి. లలిత్ మోడీ పాస్ పార్ట్ దగ్గగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ లో ఆయనకు ధన్యవాదాలు తెలిపిన ఎనిమిది మంది పేర్లలో బాన్సురీ ఒకరు. దీంతో బాన్సురీపై విమర్శలు వచ్చాయి. బీజేపీ ఆమెకు అండగా నిలిచింది. వృత్తి ధర్మాన్ని మాత్రమే పాటించానంటూ చెప్పుకొచ్చింది. ఒక దొంగకు సాయం చేశారనే ఆరోపణలు బాన్సూరీపై ఉన్నాయి.

బన్సూరి స్వరాజ్ తన ప్రైవేట్ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తూనే హర్యానా రాష్ట్రానికి అదనపు అడ్వకేట్ జనరల్‌గా కూడా నియమితులయ్యారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.