ములాయం.. భీష్ముడిలా ఉండకండి

Mon Apr 15 2019 13:21:22 GMT+0530 (IST)

Sushma Swaraj Fires On Azam Khan

ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ పార్లమెంట్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిలబడిన జయప్రదపై దారుణ కామెంట్స్ చేసిన అజాంఖాన్ భరతం పట్టింది కేంద్రమంత్రి బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్.. అజాంఖాన్ దుర్యోధనుడిలా దౌప్రది జయప్రద వస్త్రాపహరణం చేస్తున్నారని.. సమాజ్ వాదీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ములాయం భీష్ముడిలా మౌనం వహించడం పొరపాటు అని సుష్మ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ లో అజాంఖాన్ మాట్లాడిన వీడియోను షేర్ చేసి నిప్పులు చెరిగారు. జయప్రదను అంత మాట అన్న అజాంఖాన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.కాగా ఈ ఘటనపై జయప్రద కూడా స్పందించారు. అజాంఖాన్ హద్దులు మీరి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకవేళ  అజాంఖాన్ గెలిస్తే యూపీలో మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహిళలకు సమాజంలో రక్షణ ఉండదని తెలిపారు.

ఇక జయప్రద ఖాకీ నెక్కరు వేసుకుందనే విషయాన్ని తాను 17రోజుల్లోనే తెలుసుకున్నానని అజాంఖాన్ వ్యాఖ్యానించడం దుమారం రేగిన నేపథ్యంలో ఆయన మహిళల మనోభావాలను దెబ్బతీశాడని రాంపూర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం కేసు నమోదైంది. ఈ విషయంలో జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించి.. సుమోటోగా తీసుకొని అతడికి నోటీసులు జారీ చేసింది. అజాంఖాన్ పై కఠిన  చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది.