ఆడపిల్లలకు ఆస్తి పంపకాలపై సుప్రీం సంచలన తీర్పు

Tue Aug 11 2020 15:20:30 GMT+0530 (IST)

Supreme sensational verdict on property transfers to girls

ఇన్నాళ్లు తండ్రి ఆస్తిపై కొడుకులకే సర్వహక్కులు ఉండేవి. ఆడిబిడ్డలకు పెళ్లి చేసి పంపిస్తే ఇక వారికి తండ్రి ఆస్తిలో చిల్లి గవ్వ దక్కేది కాదు.కొడుకులకే మొత్తం ఆస్తి పోయేది.తాజాగా ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పించడంపై దాఖలైన పిటీషన్లను విచారించిన సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.తండ్రి జీవించి ఉన్నప్పటికీ.. మరణించినప్పటికీ ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. కుమారులతో సమానంగా కుమార్తెలకు ఆస్తిలో సమాన వాట ఉంటుందని స్పష్టం చేసింది. హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 ప్రకారం ఈ తీర్పును వెల్లడించింది.

తండ్రి జీవించి ఉన్నా.. లేకపోయినా కుమార్తెలు జీవితాంతం తండ్రిని ప్రేమిస్తూనే ఉంటారని.. పుట్టింటితో అనుబంధాన్ని కొనసాగిస్తారని.. అందుకే వారికి ఆస్తిలో వాటా ఇవ్వడం సరైందని సుప్రీం వ్యాఖ్యానించింది. చట్టం చేసిన 2005కు ముందున్న ఆస్తి వివాదాలకు కూడా ఇదే వర్తిస్తుందని.. ఆస్తిలో ఆడపిల్లలకు వాటా ఇవ్వాల్సిందేనని సుప్రీం తెలిపింది.