Begin typing your search above and press return to search.

లివింగ్ రిలేష్ ను రిజిస్టర్ చేయండి.. సుప్రీం ఏమంది?

By:  Tupaki Desk   |   21 March 2023 5:00 AM GMT
లివింగ్ రిలేష్ ను రిజిస్టర్ చేయండి.. సుప్రీం ఏమంది?
X
గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వాజ్యాల పరంపర ఎక్కువైపోతోంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి ఎంతో ముఖ్యమైన అంశాలకు సంబంధించినవి కాగా.. మరికొన్ని సందర్భాల్లో పేరుప్రఖ్యాతుల కోసమో.. సంచలనాల కోసమో అన్నట్లుగా పిటిషన్లుదాఖలు అవుతున్నాయి. తాజాగా అలాంటి పిటిషన్ ఒకటి విచారణకు రావటం.. సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం జరిగింది. గడిచిన పదేళ్లలో సహజీవనాలు దేశంలో పెద్ద ఎత్తున పెరగటం తెలిసిందే.

దీంతో కొన్ని సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. వాటిని పక్కన పెడితే.. తాజాగా రాణి అనే పిటిషనర్ సుప్రీంకోర్టును ప్రజాప్రయోజన వ్యాజ్యంతో ఆశ్రయించారు. ఆమె చేసిన అభ్యర్థన ఏమంటే.. దేశంలో సహజీవనం చేసే వారు తమ వివరాల్ని రిజిస్టర్ చేయాలన్న అభ్యర్థనను సుప్రీం ముందుకు తీసుకెళ్లారు. లివింగ్ రిలేషన్ సంబంధాల విషయంలో అత్యాచారాలు.. హత్యలు లాంటి నేరాలు నానాటికి పెరిగిపోతున్నాయని.. అలాంటి వాటికి రక్షణ కల్పించేలా రిజిస్టర్ చేసే సౌకర్యాన్నికల్పించాలని పేర్కొన్నారు.

ఇలాంటివి చేయటం ద్వారా.. సహజీవనం చేసే వ్యక్తులకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉండటంతో పాటు అత్యాచార కేసులు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ తో సహజీవనం చేసే వారికి భద్రత కల్పించాలని కోరుకుంటున్నారా? లేదంటే అలాంటి బంధంలోకి ఎవరూ వెళ్లొద్దని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించింది.

అంతేకాదు.. పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇదెంతటి తెలివితక్కువ ఆలోచన? ఇలాంటి వాటితో విలువైన కోర్టు సమయాన్ని వేస్టు చేసినందుకు ఫైన్ విధించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తూ.. పిటిషన్ ను కొట్టేసింది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కాల్ సెంటర్ ఉద్యోగిని శ్రద్ధా వాకర్ ను తన సహజీవన భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా అత్యంత కిరాతకంగా హత్య చేసిన వైనం నేపథ్యంలో.. సహజీవనం చేసే వారికి రక్షణ కల్పించేందుకు వీలుగా ఈ తరహా రిజిస్టర్ కార్యక్రమాన్ని చేపట్టాలన్నది పిటిషనర్ వాదన. దీనిపై విచారించిన సుప్రీం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కొట్టి పారేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.