సందేహాలు తీరేనా?; వ్యాపం సీబీఐకి

Thu Jul 09 2015 15:12:22 GMT+0530 (IST)

Supreme Court orders CBI probe into Vyapam

ఒక కుంభకోణానికి సంబంధించి దాదాపు 49 అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నా కూడా దానిపై సీబీఐ విచారణ జరిపేందుకు కేంద్ర హోం మంత్రి స్థాయి వ్యక్తి సైతం నో అన్న వ్యాపం కుంభకోణానికి సంబంధించి తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది.వ్యాపం కుంభకోణాన్ని సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తదితరులతో కూడిన పలువురి పిటీషన్లను విచారించిన సుప్రీంకోర్టు తాజాగా తన ఆదేశాల్ని జారీ చేసింది. పిటీషనర్లు కోరిన విధంగా వ్యాపం కేసును సీబీఐ విచారణ చేపట్టాలంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. ఇప్పటివరకూ సాగిన మిస్టరీ మరణాలు చెక్ పడతాయా? వ్యాపం అసలు రహస్యం బయటకు వస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.