లేడీ టెక్కీని అత్యాచారం చేసి హత్య చేసిన కారు డ్రైవర్ ను చచ్చేవరకూ జైల్లోనే ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2005లో బెంగళూరులోని ఓ ఐటీ ఉద్యోగినిని నైట్ డ్యూటీ ముగించుకొని తన ఇంటికి క్యాబ్ లో వెళుతుండగా ఆ క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసి అనంతరం విషయం బయటపడుతుందన్న భయంతో హత్య చేశాడు. ఈ క్యాబ్ డ్రైవర్ కు సుప్రీంకోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది.
28 ఏళ్ల యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ యువతిపై అత్యాచారం చేసి చంపినందుకు కర్ణాటక హైకోర్టు ఇప్పటికే విధించిన జీవితఖైదు శిక్షను సుప్రీంకోర్టు సమర్ధిస్తూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తూ నిందితుడు శివకుమార్ను జైలులో ఉంచాలని ఆదేశించింది.
జస్టిస్ అభయ్ ఎస్ ఓకా జస్టిస్ రాజేష్ బిందాల్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. "నిందితులను సంస్కరించే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు అటువంటి క్రూరమైన కేసులో అనవసరమైన మెతకతనం చూపడం మంచిది కాదు.
ప్రజల విశ్వాసాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి. న్యాయ వ్యవస్థ యొక్క. బాధితుడి హక్కులను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఇది జీవిత కాల శిక్ష విధించబడే కేసు అని ' జడ్జీల బృందం తీర్పునిచ్చింది.
డిసెంబరు 13 2005న ఒక బహుళజాతి కంపెనీలో పనిచేసిన బాధితురాలు రాత్రి షిఫ్ట్ ముగించుకుని ఆఫీసు క్యాబ్ లో ఇంటికి వెళుతుండగా ఆ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ అత్యాచారం చేసి హత్య చేశాడు. శివకుమార్ నిర్జన ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేసి గొంతు కోశాడు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహిళల భద్రత కోసం ప్రభుత్వం విధానాలను రూపొందించింది. 2010లో బెంగళూరులోని ఫాస్ట్ట్రాక్ కోర్టు శివకుమార్కు మరణశిక్ష విధించింది. 2016లో కర్ణాటక హైకోర్టు మరణశిక్ష విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించి జీవిత ఖైదును సమర్థించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.