Begin typing your search above and press return to search.

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ద‌ర్యాప్తుపై సుప్రీం క‌న్రెర్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   20 March 2023 7:26 PM GMT
వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ద‌ర్యాప్తుపై సుప్రీం క‌న్రెర్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ‌, సీబీఐ వ్య‌వ‌హారంపై దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ద‌ర్యాప్తుఏ ద‌శ‌లో ఉందో త‌మ‌కు సీల్డ్ క‌వ‌ర్‌లో అందించాల‌ని సీబీఐని ఆదేశించింది. అంతేకాదు.. అస‌లు ద‌ర్యాప్తు ఎందుకు ఇంత ఆల‌స్యం అవుతోంద‌ని ప్ర‌శ్నించింది.

``హ‌త్య జ‌రిగి నాలుగేళ్ల‌యినా.. విచార‌ణ ఎందుకు పూర్తి చేయ‌లేక‌పోతున్నారు. ఇందులో సీబీఐ ఎందుకు అంత నిర్లిప్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇది చాలా సీరియ‌స్ విష‌యం`` అని సుప్రీ కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న శివ‌శంక‌ర‌రెడ్డి భార్య తుల‌స‌మ్మ సుప్రీంకోర్టు గ‌డ‌ప తొక్కారు. త‌న భ‌ర్త‌ను అన్యాయంగా ఇరికిం చార‌ని.. సీబీఐ అధికారి రామ్‌సింగ్ త‌మ‌ను దూషించార‌ని.. త‌న భ‌ర్త‌ను కొట్టార‌ని..ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డంతోపాటు ఈ కేసు విచార‌ణ నుంచి ఆయ‌న‌ను త‌ప్పించాల‌ని ఆమె త‌న పిటిష‌న్‌లో కోరారు.

దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీకోర్టు తాజా గా.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ కేసును విచారిస్తున్న అధికారిని ఎందుకు మార్చ‌కూడ‌దో చెప్పాల‌ని సీబీఐని కోరింది. అయితే.. ద‌ర్యాప్తు అధికారి రామ్ సింగ్ బాగానే ప‌నిచేస్తున్నార‌ని సీబీఐ న్యాయ వాది కోర్టుకు వివ‌రించారు.

ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు.. బాగానే ప‌నిచేస్తున్న‌ప్పుడు కేసు విచార‌ణ ఎందుకు ఆల‌స్యం అవుతోందో చెప్పాల‌ని కోరారు. అంతేకాదు.. విచార‌ణ‌ను తొంద‌ర‌గా ముగించి.. చార్జిషీట్లు వేయ‌క‌పోతే.. తామే జోక్యం చేసుకుని అధికారిని మారుస్తామ‌ని తేల్చి చెప్పింది. దీనిపై సీబీఐ త‌న అభిప్రాయాన్ని చెప్పాల‌ని కోరింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన విచార‌ణ‌, ఎవ‌రెవ‌ర‌ని విచారించారో.. కూడా త‌మ‌కు చెప్పాల‌ని.. సీబీఐ న్యాయ‌వాదిని ఆదేశించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.