Begin typing your search above and press return to search.

చైనా అద్భుత ఆవిష్కరణ .. గంటకు 600 కిమీ వేగంతో వెళ్లే రైలు !

By:  Tupaki Desk   |   21 July 2021 4:53 AM GMT
చైనా అద్భుత ఆవిష్కరణ .. గంటకు 600 కిమీ వేగంతో వెళ్లే రైలు !
X
చైనా ... ఏదైనా కొత్తగా తయారు చేసి ప్రపంచానికి పరిచయం చేయడంలో అన్ని దేశాల కంటే కొంచెం ముందు ఉంటుంది. ఆవిష్కరణలకు, అద్భతాలకు చైనా దేశం పెట్టింది పేరు. ఎన్నో అద్భుతాలకు పుట్టినిల్లు అయిన చైనా తాజాగా మరో అద్భుతాన్ని పంచానికి పరిచయం చేసింది. తాజాగా మరో కొత్త ఆవిష్కరణను వెలుగులోకి తీసుకువచ్చింది. గంటకు 600 కిమీ వేగంతో దూసుకుపోయో అత్యాధునిక మాగ్లెవ్ రైలును ప్రపంచం ముందుకి తీసుకువచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ రైలును చైనా తయారు చేసింది. ఇది గంటకు 600 కిలోమీటర్ల వేగంతో అయస్కాంత శక్తితో ప్రయాణిస్తుందని చైనా తెలిపింది. ఈ రైలు చైనా తూర్పు షాన్డాంగ్ ప్రావిన్స్.. తీరప్రాంత నగరమైన కింగ్డావో రవాణా వ్యవస్థల ప్రయాణికులకు సేవలను అందించనున్నట్లు వెల్లడిచేసింది. ఈ రైలును తాజాగా చైనా లాంచ్‌ చేసింది. భూమిపై ప్రయణించే అత్యంత వేగమైన రైలుగా మోగ్లెవ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ రైలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బీజింగ్‌ నుంచి షాంఘైకి కేవలం రెండున్నర గంటల్లో చేరుకోవచ్చని దీని రూపకర్తలు చెబుతున్నారు. ఈ రెండు పట్టణాల మధ్య దూరం సుమారు వెయ్యి కిలోమీటర్లకు ఎక్కువగానే ఉంటుంది.

2016 అక్టోబర్‌లో ఈ హై-స్పీడ్ మాగ్లెవ్ రైల్ ప్రాజెక్ట్ ప్రారంభమై.. 2019 లో పూర్తి అయినట్లు వివరించింది. 2020 జూన్‌లో టెస్ట్ రన్ నిర్వహించగా విజయవంతమైనట్లు పేర్కొంది. ఈ రైలు రెండు నుంచి 10 బోగీలతో ప్రయాణిస్తుందని ఒక్కొ బోగిలో 100 మందికి పైగా ప్రయాణం చేసేలా రూపోందించినట్లు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ డింగ్ సన్సాన్ తెలిపారు.

ఇకపొతే ఈ రైలు సాధారణ రైళ్లు ప్రయాణించే ట్రాక్‌ పై ప్రయాణాన్ని కొనసాగించలేవు. ఈ మాగ్లెవ్ ట్రైన్స్ కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ ను నిర్మించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రైళ్లు ట్రాక్‌ ను ఆనుకొని కాకుండా కాస్త గాల్లో తేలి ప్రయాణిస్తుంది. అత్యంత బలమైన విద్యుదయస్కాంత శక్తితో గాల్లో తేలుతూ నడుస్తుంది.

మాగ్లెవ్‌ టెక్నాలజీతో రూపొందించిన తేలికపాటి ట్రైన్స్‌ ను చైనా ఇప్పటికే ఉపయోగిస్తోంది. ప్రస్తుతం ఈ రైళ్లను కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. మాములు చక్రాల మాదిరిగా కాకుండా ఈ రైళ్లు ప్రయాణం సమయంలో పట్టాలను తాకకుండా ప్రయాణం చేస్తాయి. దీంతో అత్యంత వేగం సాధ్యం అవుతుంది. అంతేకాదు, రైళ్లు ప్రయాణం చేసే సమయంలో పెద్దగా శబ్దం కూడా రాదని అధికారులు చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో చైనా దేశ వ్యాప్తంగా ఈ మాగ్లెవ్ రైళ్లను నడిపేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికలు వేస్తున్నట్టు స్థానిక ప్రముఖ మీడియా వెల్లడించింది. ఈ మాగ్లెవ్ రైళ్లపై ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు చాలా ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా జపాన్, జర్మనీ దేశాలు ఇప్పటికే చైనాతో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మాగ్లెవ్ ట్రైన్స్ విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..గంటకు 600 కి.మీలకు పైగా వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్ల నిర్వహణ అంత సులభమైన విషయం కాదు. ఈ మాగ్లెవ్ ట్రైన్స్ ను మెయిన్ టైన్ చేయాలి అంటే భారీ మొత్తంలో నిధులు అవసరమవుతుంటాయి.

ఈ కారణంగానే కొన్ని దేశాలు ఈ టెక్నాలజీపై ఆసక్తిగా ఉన్నా, నిధుల విషయంలో ఎటూ తేల్చుకోలేక కొంచెం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రైళ్లను వినియోగంలోకి తీసుకురావాలంటే ఇప్పటికే ఉన్న ట్రాక్‌ లను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. కాబట్టి కొత్తగా రూట్లను వేయాలి. ఇది అంత చిన్న విషయం కాదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ మాగ్లెవ్ ట్రైన్ ఎలాంటి రికార్డ్స్ ను సృష్టిస్తుందో.