వింత ఆచారంః పెళ్లికొడుక్కి గడ్డం ఉండొద్దట.. పెంచితే ఏం చేస్తారంటే..?

Thu Apr 22 2021 18:00:01 GMT+0530 (IST)

Strange custom: When the bridegroom has a beard .. What will he do if he grows it ..?

ఈ ప్రపంచంలో ఎన్నిరకాల జాతులు ఇంకెన్ని రకాల తెగలు ఉన్నాయో స్పష్టంగా చెప్పడం కష్టం. అందులో ఎవరెవరు ఎలాంటి సంప్రదాయాలు పద్ధతు అనుసరిస్తుంటారో చెప్పడం అసంభవం. వందలు వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నాగరికతలో కొన్ని అలవాట్లు అంతరించాయి. ఎన్నో అలవాట్లు పుట్టుకొచ్చాయి. అలాంటి వాటిల్లో ఒక వింతైన ఆచారం పుదుచ్చెరిలో పాటిస్తున్నారు.మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనవి మూడు ఘట్టాలు. పుట్టుక చావు పెళ్లి. మొదటి రెండు ఎప్పుడు? ఎక్కడ? ఎలా? జరుగుతాయో ఎవరికీ తెలియదు. కానీ.. పెళ్లి మాత్రం తెలిసి అనుకొని కోరుకొని జరుగుతుంది. అలాంటి పెళ్లిలో వేలాది సంప్రదాయాలు ఉన్నాయి. మతానికో రీతిన.. కులానికో పద్ధతిన.. జాతికో తీరున జరుగుతుంటాయి. అయితే.. సముద్ర తీరప్రాంతమైన పుదుచ్చెరిలోని కరైకల్ జిల్లాలో వింత పద్ధతి అమల్లో ఉంది.

ఇక్కడ మెజారిటీగా జాలర్లు ఉండే గ్రామాలు ఉన్నాయి. వీరి సాంప్రదాయం ప్రకారం.. పెళ్లి రోజున వరుడు క్లీన్ షేవ్ తో ఉండాలట. గడ్డం మొలక కూడా కనిపించకూడదట. ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పద్ధతి. అయితే.. ఈ మధ్య ఈ ట్రెండ్ మారుతోందట. చదువుకున్న యువకులు.. ప్రపంచాన్ని ఫాలో అవుతున్నవారు గడ్డం పెంచేస్తున్నారట.

దీంతో.. అక్కడి పెద్దల్లో ఆవేదన ఆగ్రహం వ్యక్తమయ్యాయి. ఇది వాళ్లకు చాలా పెద్ద సమస్యగా కనిపించినట్టుంది. జాలర్లు అధికంగా ఉండే 11 గ్రామాల ప్రజలు సమావేశమై సమష్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట జరిగే పెళ్లిళ్లలో.. వరుడు గడ్డంతో ఉండకూడదని తీర్మానించారు. ఒకవేళ ఎవరైనా ఈ రూల్ ను అతిక్రమిస్తే.. పెళ్లికి వచ్చేది లేదని రెజుల్యూషన్ పాస్ చేశారట. ఈ నిర్ణయంతో ఇక మీదట క్లీన్ షేవ్ తోనే పెళ్లి కొడుకు కనిపిస్తారట. భలేగా ఉంది కదూ.. ఈ సంప్రదాయం.