ఒక వ్యక్తి ద్వారా వేల మందికి వైరస్: శ్రీలంకలో కల్లోలానికి అతడే కారణం

Thu Jul 16 2020 22:00:01 GMT+0530 (IST)

Virus infects thousands of people with one person: One cause of unrest in Sri Lanka

వైరస్ బారిన ప్రస్తుతం అమెరికాతో భారతదేశం పోటీ పడుతోంది. భారత్‌లో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో పరిస్థితి అలా ఉంటే పొరుగున ఉన్న ద్వీపకల్ప దేశం శ్రీలంకలో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఆ దేశంలో కూడా తీవ్రంగా వైరస్ వ్యాపిస్తోంది. అయితే ఆ దేశంలో ఒక వ్యక్తి ద్వారా దేశమంతటా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందిందని ఆ దేశం గుర్తించింది. వైరస్ వ్యాప్తి క్రమాన్ని అధ్యయనం చేసిన ఆ దేశ ప్రభుత్వం అత్యధిక కేసులకు ఓ వ్యక్తినే కారణమంటూ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆ దేశంలో 2600కు పైగా కేసులు ఉన్నాయి. వాటిలో సగం మందికి ఓ వ్యక్తి ద్వారానే వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు.పేషెంట్ 206 అని ప్రస్తావిస్తూ ఆ వ్యక్తికి ఉన్న డ్రగ్ అలవాటు వలనే మూడు ప్రాంతాలను క్లస్టర్‌లుగా ప్రకటించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఆ వ్యక్తి ఖండించడం గమనార్హం. అతడే ప్రసాద్ దినేశ్ (33). తనను అన్యాయంగా.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని వాపోయాడు. ఇంతమందికి వైరస్ సోకడానికి తాను కారణంగా చెప్పడాన్ని అతడు ఖండించారు. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందిన అతడు ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. ఈ సమయంలో ప్రభుత్వం పేషెంట్ 206 అని చెప్పి తనపై ఆరోపణలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.

వాస్తవంగా దినేశ్ గత నెలలో ఓ దొంగతనం కేసులో పోలీసులకు చిక్కాడు. ఈ సమయంలో అతడికి జ్వరం ఉన్నట్లు గుర్తించిన పరీక్షలు చేయగా పాజిటివ్ తేలింది. ఈ సందర్భంగా అతడి ద్వారా దాదాపు 900 మందికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. అందుకే పేషెంట్ 206గా పిలుస్తూ అతడే కారణమంటూ ప్రభుత్వం ప్రకటించింది.