Begin typing your search above and press return to search.

తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్ర.. ఆకాశంలో అద్భుతం!

By:  Tupaki Desk   |   28 May 2020 7:30 PM GMT
తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్ర.. ఆకాశంలో అద్భుతం!
X
అంతరిక్షయానం.. ఇన్నాళ్లు అదో కలకలం ప్రపంచం. దేశాల ప్రభుత్వాల సంస్థలతోనే వెళ్లాలి. కానీ ఇప్పుడు ప్రైవేటులోనూ అది సాధ్యమేనని నిరూపిస్తోంది ఓ ప్రైవేటు సంస్థ. ఈ రాత్రి ఆ ఘనతను సాధించబోతోంది. దీంతో అంతరిక్షంలో కొత్త శకం మొదలవబోతోంది.

ప్రపంచంలోనే తొలిసారి ఓ ప్రైవేట్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ తొలి ప్రైవేటు అంతరిక్ష యానాన్ని చేపట్టింది. రాబోయేరోజుల్లో అంతరిక్ష ప్రయోగాల్లో పెట్టుబడులు విస్తరించేందుకు.. కొత్త అన్వేషణలు చేసేందుకు.. సామాన్యులు సైతం విమాన మెక్కినట్టు అంతరిక్షంలోకి వెళ్లగలిగేందుకు ఈ ఘట్టం దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

స్పేస్ ఎక్స్ సంస్థ వ్యవస్థాపకులు, బడా వ్యాపారి ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఈ తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్రకు అంతా సిద్ధమైంది. ‘క్రూ డ్రాగన్’ అనే మానవ సహిత క్యాప్సూల్ ను బుధవారం రాత్రి ప్రయోగిస్తున్నారు. ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నారు.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఆధ్వర్యంలో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. స్పేస్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడంలో బాగంగా నాసా ఈ ప్రైవేట్ కంపెనీలకు అవకాశం ఇచ్చింది.

స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన వాహన నౌక భూ వాతావరణాన్ని దాటి అంతరిక్షంలోకి చేరడానికి 12 నిమిషాల సమయం పడుతుంది. ఆ గడువు విజయవంతంగా ముగిస్తే.. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొదటి ప్రైవేటు సంస్థగా స్పేస్ ఎక్స్ నిలుస్తుంది. ఇప్పుడు స్పేస్ లోకి.. ఆ తర్వాత రాబోయే రోజుల్లో చంద్రుడిపైకి.. ఆ తర్వాత మార్స్ పైకి వెళ్లేందుకు స్పేస్ ఎక్స్ ప్రణాళికలు చేస్తోంది.