సోము వీర్రాజు.. నోటి దూల.. అప్పటికి కాని తీరదా..?

Sat Jan 29 2022 17:00:55 GMT+0530 (India Standard Time)

Somu Veerraju  mouth beam  but not the shore

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. నోటి దూలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒకవైపు పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా ఆయనే నోరు పారేసుకోవడం.. అనవస ర విషయాల్లో వేలు పెట్టి.. వివాదాలు కొని తెచ్చుకోవడం.. వంటివి వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ను నాశనం చేస్తుంటే.. దీనికి పది రెట్లు ఎక్కువగా పార్టీని మరింతగా ఇబ్బంది పాలు చేస్తోందని.. సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ``మాలాంటి వారు తప్పులు చేస్తే.. సరిదిద్దాల్సింది ఆయనే. మరి ఆయనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఏం చెబుతాం. ఆయన తప్పులు ఆయన తెలుసుకోవాలి. లేకపోతే.. అధిష్టానం ఎలానూ ఉంది!`` అని కడప జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.తాజాగా మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. కడప జిల్లాకు కూడా కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయం తీసుకువచ్చిందని వ్యాఖ్యానిస్తూ..`హంతకుల జిల్లా` అని వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. పార్టీలకు అతీతంగా అందరూ.. సోమును తీవ్రస్థాయిలో విమర్శించారు. తమకు హత్యలను అంటగడతారా? అంటూ.. ఇక్కడి ప్రజలు కూడా రోడ్డెక్కారు. వాస్తవానికి కడప నుంచే ఇద్దరు నుంచి నలుగురు కీలక నేతలు బీజేపీలో ఉన్నారు. వీరివల్లే.. అంతో ఇంతో పార్టీ పుంజుకుంటోంది. అయితే.. ఇప్పుడు సోము చేసిన వ్యాఖ్యలతో వీరు ఎవరూ కూడా పుంజుకునే పరిస్థితి లేకపోగా.. ప్రజల మధ్యకు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు.

నిజానికి ఇటీవలే.. సోము వీర్రాజు.. తాము అధికారంలోకి వస్తే.. చీపు లిక్కర్ను రూ.50 కే ఇస్తామని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. అయినా.. కూడా తాను వెనక్కి తగ్గలేదు. పైగా.. తనను తాను సమర్ధించుకున్నారు. దీంతో సోము వీర్రాజు కాస్తా.. సారాయివీర్రాజు అయిపోయారు. తాజాగా దీనిపైనా మరో కీలక వ్యాఖ్య చేశారు. తాగుబోతులు తమకు తక్కువ ధరకే మందు కావాలంటే.. బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు.. బీజేపీకి ప్లస్సా మైనస్సా.. అనేవి.. ఆయనకే తెలియాలని.. పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

మరికొందరు నేతలు.. అంతర్గత చర్చల్లో సోము కు నోటి దూల తీరడం లేదని.. ఆయనకు సరైన విధంగా చెక్ పెడితే.. తప్ప ఇలాంటి వాటిని తగ్గించుకోరని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ పుంజుకోవడం లేదని.. పార్టీలో నేతలు తనతో సహకరించడం లేదని. సోము అసహనానికి గురవుతున్నారని .. మరికొందరు అంటున్నారు. అయితే.. ఎంత అసహనం ఉన్నా.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మొత్తానికే మోసం వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే సోము వ్యాఖ్యలపై కేంద్రంలోని బీజేపీ పెద్దలకు నివేదికలు వెళ్తున్నాయని.. త్వరలోనే ఆయనను పదవి నుంచి పక్కన కూర్చోబెడతారని.. అప్పటికి కానీ.. సోము నోటి దూల తీరదని వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.