విరాట్ తో నాకు ఆ సంబంధం లేదు

Mon Jan 21 2019 23:10:04 GMT+0530 (IST)

Sofia Hayat Gives Clean Chit to Virat Kohli and Rohit Sharma

బాలీవుడ్ హాట్ బ్యూటీ సోఫియా హయత్ ఇటీవల సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. టీం ఇండియా ఆటగాడు రోహిత్ మరియు తాను కొన్నాళ్ల క్రితం ప్రేమించుకున్నామని కొన్ని కారణాల వల్ల విడిపోయామంటూ చెప్పుకొచ్చిన ముద్దుగుమ్మ సోఫియా హయత్ అదే సమయంలో రోహిత్ దాని కంటే విరాట్ ది చాలా పెద్దగా ఉంటుందని పిచ్ బయట కోహ్లీ మంచి ఆటగాడు అంటూ అనుమానాలు వచ్చేలా వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.కోహ్లీపై సోఫియా హయత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. దాంతో తన గురించి మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించింది. తాను గతంలో చేసిన కొన్ని ట్వీట్స్ ను తీసుకుని వాటిని ఎడిట్ చేసి నా పరువును తీసే ఉద్దేశ్యంతో కొందరు ఇలా చేస్తున్నారని ఆరోపించింది. విరాట్ కు నాకు మద్య అసలు ఏం జరగలేదు. తామిద్దరం ఒక్కటి రెండు సార్లు అది కూడా చాలా సాదారణంగా కలిశాం అంటూ క్లారిటీ ఇచ్చింది. సోఫియా వ్యాఖ్యలతో కోహ్లీకి క్లీన్ చీట్ దక్కింది.

ఇక రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ మరోసారి తామిద్దరం గతంలో ప్రేమించుకున్నాం. అయితే ప్రస్తుతం ఇద్దరం కూడా విడిపోయి ఎవరికి వారు సంతోషంగా ఉన్నాం. ఇద్దరం మంచి స్నేహితులుగానే విడిపోయామని తనకు ఎవరితో శారీరక సంబంధాలు లేవన్నట్లుగా సోఫియా చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ అమ్మడు పబ్లిసిటీ కోసం గతంలో వ్యాఖ్యలు చేసి ఇప్పుడు అయ్యో అది నేను కాదంటూ కలరింగ్ ఇస్తుందనిపిస్తుంది.