డిసెంబర్ 23న ఏపీ కొత్త సీఎం ప్రమాణం....?

Sat Apr 01 2023 05:00:02 GMT+0530 (India Standard Time)

Social Media on AP Elections and Results

ఏపీ రాజకీయాల మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముందస్తు ఎన్నికలు ముంచుకుని వస్తాయని అంటున్నారు. నిజానికి 2024లో ఎన్నికలు జరగాలి. షెడ్యూల్ ని కాదని ఆరు నెలల అధికారాన్ని వదులుకుని మరీ వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరినా ఏదో జరుగుతోంది అని అనుకోక తప్పేట్లు లేదు.ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందస్తు ఎన్నికలు ఏపీలో జరగవచ్చు అని రాసుకొస్తూంటే సోషల్ మీడియా మరి నాలుగు ఆకులు ఎక్కువ చదివింది కాబట్టి ఇంకా ముందుకెళ్ళి ఏపీలో ఎన్నికలు ఎపుడు జరుగుతాయి అన్న దాన్ని మొదలుకుని కొత్త ముఖ్యమంత్రి ఏ డేట్ ని ప్రమాణం చేస్తారు అన్న దాని మీద కూడా డేట్స్ ఇచ్చేస్తునాయి.

నిజానికి ఊహాగానాలకు ఒక హద్దు ఉంటుంది.కానీ అన్నీ దాటేసి సోషల్ మీడియాలో మాత్రం ఏపీలో ముందస్తు ఎన్నికలు నూటికి నూరు శాతం ఖాయమని చెబుతూ డేట్స్ ఇచ్చేస్తున్నారు ఏపీలో ముందస్తు ఎన్నికలు కోసం  సరైన టైం చూసుకుని అసెంబ్లీని రద్దు చేసారట.

అంటే మే లో అసెంబ్లీ రద్దు చేస్తే అప్పటికి ఆరు నెలల లోగా ఎన్నికలు జరగాలి కాబట్టి డిసెంబర్లో ముందస్తు  ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఇక తెలంగాణాతో పాటే ఏపీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. నంవబర్ 18 నుంచి నామినేషన్లు ప్రక్రియ మొదలెట్టి నామినేషన్ల ఉపసంహరణ తేదీని నవంబర్ 28తో ముగిస్తారు అంటున్నారు

ఇక ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీ డిసెంబర్ 15గా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఓట్ల లెక్కింపు డిసెంబర్ 19న జరుగుతుందని కొత్త ప్రభుత్వం డిసెంబర్ 23న ఏర్పాటు అవుతుందని అంటున్నారు. అంటే సీఎం డిసెంబర్ 23న కొత్త సీఎం ప్రమాణం చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

ఇక్కడ చూస్తే డిసెంబర్ 23 తేదీని ఎందుకు ఎంచుకున్నారో అర్థం చేసుకోవాలి. మార్చి 23న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ రిజల్ట్స్ వచ్చాయి. వాటిలో టీడీపీ అనూహ్యంగా ఒక సీటు గెలుచుకుంది. పైగా ఈసారి 23 డేట్ తమకు ఫేవర్ అని టీడీపీ చెబుతోంది. 2023 డిసెంబర్ 23 ఇలా తమకు కలసి వచ్చే తేదీలలో ఎన్నికలు జరుగుతాయని టీడీపీ అభిమానులు ఎవరైనా ఈ డేట్స్ ని పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారా  అన్న చర్చ సాగుతోంది.

నిజానికి చూస్తే తెలంగాణాలో కొత్త ప్రభుత్వం 2018 డిసెంబర్ 12న ఏర్పాటు అయింది. దాంతో గడువు 2023 డిసెంబర్ 11తో ముగుస్తుంది. దాని కంటే ముందే తెలంగాణాలో ఎన్నికలు జరగాలి. ఏపీకి కూడా అదే టైం లో ఎన్నికలు పెట్టాల్సి ఉంటే ఒకెసారి డేట్స్ ఇస్తారు అలా సోషల్ మీడియాలో ప్రచారం సాగినట్లుగా డిసెంబర్ 23న అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాడదు అంతకంటే ముందే ఏర్పడవచ్చు.

ఇక ఏపీలో జగన్ సర్కార్ ఆరు నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయదని అంటున్నారు. తమకు కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వస్తే ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్తుంది అని అంటున్నారు. మొత్తానికి ముందస్తు అంటే చాలా జోష్ మీద సోషల్ మీడియాలో ప్రచారం చెస్తున్న వారు ఎక్కువ అయ్యారు. మరి చూడాలి నిజంగా ముందస్తు ఉంటుందా లేక 2024 షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు పెడతారా అన్నది.         


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.