Begin typing your search above and press return to search.

హెల్త్: గురకతో డేంజర్.. నిద్రలోనే పోతారు

By:  Tupaki Desk   |   22 Oct 2019 5:30 PM GMT
హెల్త్: గురకతో డేంజర్.. నిద్రలోనే పోతారు
X
గురక.. ఇప్పుడు పెట్టేవాళ్లకు ఏ సమస్య రాదు కానీ.. వారి పక్కన పడుకునేవారికి నరకమే.. ఆ గురకతో నిద్రాభంగం కలిగి అసలు నిద్రేపట్టని పరిస్థితి నెలకొంటుంది. అయితే పక్కనున్న వారికి కేవలం నిద్రాభంగమే..కానీ నిజానికి గురక పెట్టేవాళ్ల ఆరోగ్యానికి జరిగే నష్టమే ఎక్కువ అని ఓ అధ్యయనంలో తేలింది.

తాజా పరిశోధనలో గురక వల్ల గుండెపోటు బారినపడుతారని.. నిద్రలోనే ప్రాణం పోయిన సంఘటనలు ఎక్కువ అని స్లీప్ అప్నియా జరిగే అవకాశాలు ఉంటాయని అధ్యయనంలో రుజువైంది.

పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో గురకపెడుతారు. గురక అంత సహజమైన చర్య. గురకపెడితే గాఢ నిద్ర పోయారని అనుకుంటారు. కానీ గురక వల్ల మనిషి డిస్ట్రబ్ అవుతాడు. కంటి నిద్ర కరువవుతాడు. దీంతో పగలంతా మత్తుగా ఉంటుంది. పనులు చేయలేని పరిస్థితి.. ఆక్సిజన్ అందక ఆరోగ్యం దెబ్బతింటుంది.

*గురకకు కారణాలు..

స్తూలకాయం, నాలుక పెద్దగా ఉండడం.. కొండ నాలుక పెద్దగా ఉండడం.. దవడల నిర్మాణంలో తేడాల వల్ల గురక వస్తుంటుంది. ఇవన్నీ శ్వాసనాళానికి అడ్డంకులుగా మారుతాయి. నిద్రలో గురక వల్ల మెలకువ వచ్చి ఇబ్బందులు కలిగితే స్లీప్ అప్నియాకు దారితీస్తుంది.. మెలకువ ఊరికే అయితే ఆక్సిజన్ లోపం కలుగుతుంది.

*గుండె జబ్బులు వస్తాయి..

శ్వాసకు ఇబ్బందులు ఏర్పడితే సరిపడా ఆక్సిజన్ అందదు. ఈ స్థితి గుండె మీద ఒత్తిడి పెంచుతుంది. హఠాత్తుగా గుండె ఆడిపోవచ్చు. సాధారణంగా గుండెపోటుతో నిద్రలోనే ప్రాణం పోతుంది. అందుకే గురకను తగ్గించుకుంటేనే గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

గురకకు సర్జరీ అవసరం లేదు. గురకతో నిద్ర భంగం కలుగకుండా నోట్లో అమర్చుకునే పరికరాలున్నాయి. స్లీప్ నియంత్రించే పరికరం సీపాప్ ఉపయోగించవచ్చు. గురక అంతిమంగా గుండె జబ్బులకు కారణం అవుతుందని తేలింది. సో అందరూ జాగ్రత్తలు పాటించండి.