Begin typing your search above and press return to search.

నిద్రకూడా పట్టడం లేదు.. నేనింకా షాక్​లో ఉన్నా.. ఆరోపణలపై స్మిత్​ స్పందన..!

By:  Tupaki Desk   |   14 Jan 2021 2:30 PM GMT
నిద్రకూడా పట్టడం లేదు.. నేనింకా షాక్​లో ఉన్నా.. ఆరోపణలపై స్మిత్​ స్పందన..!
X
ఆస్ట్రేలియా టూర్​లో భాగంగా ప్రస్తతం టెస్ట్​ సిరీస్​ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే టీ20, వన్డే సిరీస్​ కాస్త ప్రశాంతంగానే సాగింది. కానీ టెస్ట్​ క్రికెట్​ స్టార్ట్​ అయ్యాక పలు వివాదాస్పద అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ఆటగాళ్లు నోటికి పనిచెప్తున్నారు. గత టెస్ట్​మ్యాచ్​లో రవిచంద్రన్​ అశ్విన్​పై.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాటల దాడి చేసిన విషయం తెలిసిందే.

దీనికి రవిచంద్రన్​ కూడా దీటుగానే బదులిచ్చారు. అయితే సిడ్నీ టెస్టు నాలుగో ఇన్సింగ్​లో వికెట్ వద్ద టీమిండియా వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్ పెట్టుకున్న గార్డ్ మార్క్‌ను ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ చెరిపేస్తూ కనిపించిన వీడియో పెద్ద దుమారమే రేపింది. దీనిపై క్రికెట్​ అభిమానులు స్మిత్​ను తీవ్రంగా విమర్శించారు. అతడిలో క్రికెట్​ స్పిరిట్​ లోపించిందని ఆరోపించారు. అయితే ఈ విషయంపై ఇప్పటికే ఆసిస్​ క్రీడాకారులు స్పందించారు.

పంత్​ పెట్టుకున్న మార్క్​ను.. స్మిత్​ చెరపలేదని.. అతడు ప్రతి మ్యాచ్​లోనూ అలాగే చేస్తాడని సహచర ఆటగాళ్లు చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం ముగిసిపోలేదు. తాజాగా ఈ వివాదంపై స్మిత్​ నేరుగా స్పందించారు. ‘ ఈ వివాదం విని నేను నిజంగా షాక్​ అయ్యాను. నాకు నిద్రకూడా పట్టడం లేదు. నేను ప్రతిమ్యాచ్​లోనూ అలాగే చేస్తుంటా. నా మీద ఇటువంటి ఆరోపణలు రావడంతో ఎంతో బాధపడ్డా’ అంటూ స్మిత్​ పేర్కొన్నారు. అయితే స్మిత్​ వివరణతోనైనా.. అతడిపై విమర్శలు ఆగుతాయేమో వేచిచూడాలి.