Begin typing your search above and press return to search.

కరోనా కాటుకి బలైన ఆ నేత కుమారుడు .. ఎవరు ?

By:  Tupaki Desk   |   22 April 2021 5:30 AM GMT
కరోనా కాటుకి బలైన ఆ నేత కుమారుడు .. ఎవరు ?
X
కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులు పలువురు కరోనా బారిన పడుతున్నారు. కొందరు కరోనాను జయిస్తుండగా, మరికొందరు కరోనాతో పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. సీపీఏం సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో తీవ్ర విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి ఈ ఉదయం కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 34 సంవత్సరాలు. కరోనా వైరస్ ‌తో రెండు వారాల క్రితం గురుగావ్‌ లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ఆశిష్ అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు వారాల క్రితం కరోనా బారినపడిన ఆశిష్.. గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున ఆశిష్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి స్వయంగా తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

34 ఏళ్ల ఆశిష్… ఢిల్లీలో సీనియర్ జర్నలిస్ట్‌ గా పనిచేస్తున్నారు. కాగా, ఆశిష్ ఏచూరి ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఓ ప్రముఖ దినపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయనకు కరోనా లక్షణాలు రావడంతో కరోనా నిర్ధారణ టెస్టులు నిర్వహించారు. పరీక్షలలో ఆయనకు కోవిడ్19 పాజిటివ్‌గా తేలడంతో తొలుత హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో చేర్పించి ఆశిష్ ఏచూరికి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఇక కుమారుడు కరోనా బారిన పడటంతో కొన్ని రోజులుగా సీతారాం ఏచూరి కూడా హోం క్వారంటైన్‌ లో ఉన్నారు. తన కుమారుడికి చికిత్స అందించిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు సీతారాం ఏచూరి కృతజ్ఞతలు తెలిపారు. నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో మృతి చెందాడని చెప్పడానికి నేను బాధపడుతున్నాను. డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు, శానిటేషన్ చేసిన సిబ్బందికి, మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా తరపున కృతజ్ఞతలు తెలిపుతున్నాను’ సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు