Begin typing your search above and press return to search.

వార్నింగ్ ఇచ్చిన గజరాజులు.. తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయ ఆవరణలో షాకింగ్ సీన్

By:  Tupaki Desk   |   2 Jun 2023 10:38 AM GMT
వార్నింగ్ ఇచ్చిన గజరాజులు.. తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయ ఆవరణలో షాకింగ్ సీన్
X
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కు ముఖ ద్వారం తిరుపతి. ఈ పట్టణం పేరు చెప్పినంతనే గుర్తుకు వచ్చేది గోవిందరాజు స్వామి ఆలయం. తిరుపతి రైల్వే స్టేషన్ కుసమీపంలో ఉండే ఈ ఆలయానికి బోలడంత చరిత్ర ఉంది. తిరుమల శ్రీవారి ని దర్శించుకోవటానికి ముందు.. గోవిందరాజు స్వామి ఆలయాని కి వెళ్లి.. తిరుమల కు వెళితే పుణ్యం మరింత వస్తుందన్న ప్రచారం గురించి తెలిసిందే. ఈ పురాతన ఆలయం అద్భుతంగా ఉంటుంది. అయితే.. గురువారం సాయంత్రం చోటు చేసుకున్నగాలి వాన కు అనూహ్య పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

ఆలయ ధ్వజ స్తంభం వద్ద ఉన్న వందల ఏళ్ల నాటి భారీ రావిచెట్టు కూలిపోయింది. ఆలయ మహాద్వారానికి ఎదురుగా ఉన్న ఈ భారీ చెట్టు గాలివాన కు మొదలు రెండు ముక్కలుగా చీలి అక్కడి భక్తుల మీద పడింది. ఈ ఘటన లో ఒకరు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.అనుకోని రీతిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో కడపకు చెందిన ఒక వైద్యుడు గుర్రప్ప (72) మరణించారు. ఆయన కుమార్తె శ్రీరవళి తిరుపతి లోని ఒక కాలేజీలో మెడిసిన్ చేస్తున్నారు.

ఆమె ను చూసేందు కు తిరుపతికి వచ్చిన గుర్రప్ప.. కుమార్తె తో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చి.. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తండ్రి మృతదేహం వద్ద కుమార్తె రోదించిన వైనం అక్కడి వారిని కలిచివేసింది.. అయితే.. ఈ రావిచెట్టు కూలిపోవటానికి కాస్త ముందుగా.. ఆలయ గజరాజులు పెద్ద ఎత్తున ఘీంకారం చేయటంతో పెద్ద ముప్పు తప్పింది.

ఎప్పుడూ శబ్దాలు చేయని గజరాజులు.. అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున ఘీంకారాలు చేయటంతో ఉలిక్కిపడిన సిబ్బంది , భక్తులు ఆవరణ నుంచి బయట కు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పినట్లుగా చెబుతున్నారు. నిజానికి స్వామివారి ఉత్సవాల కు గజరాజుల ను సిద్ధం చేయటం.. అది కాస్తా రాబోతున్న విపత్తును ముందుగా పసిగట్టి.. ఘీంకరించటంతో పలువురు భక్తుల ప్రాణాల్ని సేవ్ అయినట్లుగా చెబుతన్నారు.

ఈ ఘటన జరిగిన వెంటనే గోవిందరాజు స్వామి టెంపుల్ వద్దకు వచ్చిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈవో ధర్మా రెడ్డి లు పరిశీలించారు. ఈ ప్రమాదంలో మరణించిన డాక్టర్ గుర్రప్ప కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియానుప్రకటించారు. ఈ ఉదంతంలో గాయపడిన వారికి టీటీడీ ఆసుపత్రిలో చికిత్స చేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని టీటీడీ చెబుతోంది.