Begin typing your search above and press return to search.

ఘోరం : ఒకే బెడ్డు పై బాధితుడు , మృతదేహం !

By:  Tupaki Desk   |   7 May 2021 6:30 AM GMT
ఘోరం : ఒకే బెడ్డు పై బాధితుడు , మృతదేహం !
X
కరోనా వైరస్ మహమ్మారి మనుషుల్లో ఎదో ఒక మూలన దాగి వున్న మానవత్వాన్ని కూడా మంటగలిపేస్తుంది. కళ్లెదుటే మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న చూస్తూ ఉండటం తప్ప ,ఏం చేయలేని పరిస్థితి. చికిత్స చేయిద్దాం అన్నా సమయానికి బెడ్ దొరుకుతుంది అన్న నమ్మకం లేదు. ఎలాగోలా బెడ్ దొరికింది , ఇక చికిత్స తీసుకోవచ్చులే అనుకుంటే , ఆక్సిజన్ కొరత. కరోనా తో కంటే ఆక్సిజన్ అందుకా చనిపోయే వారే ఎక్కువగా ఉంటున్నారు. ఆ ప్రాణవాయువుని సంపాదించడానికి కుటుంబ సభ్యులు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. పెద్ద పెద్ద బడా నేతలు , పారిశ్రామికవేత్తలు , రాజకీయనేతలు , సెలెబ్రెటీలకే బెడ్స్ దొరకని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బెడ్స్ పై ఉన్న వారు మరణిస్తే , మరొకరికి బెడ్ కేటాయిస్తుండటం గమనార్హం.

ఇక ఈ కరోనా కాలంలో అనేక హృదయ విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే బెడ్ పై కరోనా బాధితుడికి చికిత్స , కరోనా మృతదేహాన్ని ఉంచినట్టు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్స్ కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఒకే బెడ్ పై ఇద్దరికి చికిత్స అందిస్తున్నారట. అలాగే ఆక్సిజన్ కూడా ఒకే బెడ్ పై ఇద్దరిని పడుకోబెట్టి అందిస్తున్నారు. కణేకల్లు మండలానికి చెందిన ఓ వృద్ధుడుని కరోనా లక్షణాలతో హాస్పిటల్ లో జాయిన్ చేయడంతో , అక్కడ బెడ్స్ లేక అప్పటికే ఓ యువకుడు ఉన్న బెడ్ పై ఆక్సిజన్ పెట్టి చికిత్స అందించారు. ఆ తర్వాత కొద్ది సమయానికే ఆ వృద్ధుడు మృతిచెందగా , కరోనా మృతదేహం ఉన్న బెడ్ పైనే ఆ యువకుడికి దాదాపుగా రెండు గంటల పాటు చికిత్స అందించారంటూ ఓ వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది.