Begin typing your search above and press return to search.

షాకింగ్: దేశంలో రెండు కొత్త కరోనా వేరియంట్స్!

By:  Tupaki Desk   |   23 Feb 2021 5:30 PM GMT
షాకింగ్: దేశంలో రెండు కొత్త కరోనా వేరియంట్స్!
X
దేశంలో రెండు కొత్త కరోనా వేరియంట్స్ పుట్టుకొచ్చాయి. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. భారత్ లో రెండు కొత్త కరోనా రకాలును కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది.ఎన్ 440కే, ఈ484కే అనే రెండు రకాల వేరియంట్లను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపింది. ఈ కొత్త వైరస్ మహారాష్ట్రలో గుర్తించినట్టు తెలిపింది. మహారాష్ట్రతో పాటు కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇదే రకం వైరస్ వేరియంట్లను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.

ఇప్పటికే ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న యూకే, సౌతాఫ్రికా, బ్రెజిల్ రకం కరోనా కేసులు భారత్ లోనూ నిర్ధారణ అయ్యాయి. మరోవైపు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది.భారత్ లో బయటపడ్డ కొత్త కోవిడ్ 10 రకం యూకే రకం అని తేల్చారు. సౌతాఫ్రికా, బ్రెజిల్ రకాలతో పోల్చితే ఇది ప్రమాదాకరమైనదా కాదా తేల్చనున్నారు.

మహారాష్ట్ర, కేరళలోని కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరగడానికి ఈ కొత్త వేరియంటే కారణమా అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని తెలిపారు. మరింత శాస్త్రీయ సమాచారం ఆధారంగా వీటిని అధ్యయనం చేయాల్సి ఉందని, మరిన్ని వివరాలు అందాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.