ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Fri Mar 17 2023 13:14:59 GMT+0530 (India Standard Time)

Shock For MLC Kavitha in Supreme Court

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు  గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ కేసు విచారణ విషయంలో ఎమ్మెల్సీ కవిత నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ ఆఫీసుకు మహిళను పిలిచి విచారణ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత పిటీషన్ దాఖలు చేశారు.దీనిపై ఈనెల 24న విచారణ జరుపుతామని గతంలో కోర్టు స్పష్టం చేసింది.అయితే కవిత తాజాగా ఈ పిటీషన్ ఈడీ విచారణ జరుగుతున్న వేళ త్వరగా పరిశీలించాలని అభ్యర్థించింది. కానీ సుప్రీంకోర్టు కవిత వినతిని తిరస్కరించి షాకిచ్చింది.

కవిత పిటీషన్ ను ఈనెల 24నే విచారణ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో ఈనెల 20న ఈడీ ఇప్పటికే హాజరు కావాలని కవితకు నోటీసులు పంపింది. మరి ఈడీ విచారణకు కవిత హాజరువుతుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత నిన్న రెండో దఫాలో విచారణకు గైర్హాజరయ్యారు.. ఈ మేరకు తాను విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారు. మరికాసేపట్లో ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆమె ఈమెయిల్ ద్వారా అధికారులకు సమాచారం పంపారు. అనారోగ్యంతోపాటు సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఈడీ విచారణకు రాలేకపోతున్నట్టుగా పేర్కొన్నారు.

మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈనెల 11న జరిగిన విచారణలో ఈడీ అధికారులు అడిగిన పత్రాలను తన న్యాయవాది భరత్ ద్వారా కవిత పంపారు. సుప్రీంకోర్టు విచారణ తర్వాత హాజరు కావాలని భావించారు. కోర్టునుంచి సానుకూలత కోసం ఎదురుచూశారు.

కానీ సుప్రీంకోర్టు అత్యవసరంగా విచారించడానికి నిరాకరించడంతో ఇప్పుడు 20న జరిగే విచారణకు కవిత హాజరవుతుందా? సుప్రీంకోర్టు తీర్పు వరకూ ఎదురుచూస్తుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.