వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులపై షర్మిల స్పందన.. జగన్ కు కీలక సలహా

Tue Jan 24 2023 17:34:06 GMT+0530 (India Standard Time)

Sharmila response to notices to YS Avinash Reddy

వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అవినాష్ రెడ్డి నుంచి కీలక ఆధారాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అవినాష్ కు ఇచ్చిన నోటీసులపై సోదరి షర్మిల స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.కడపలో గొప్ప నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి అని షర్మిల వ్యాఖ్యానించారు. ఆయన హత్య జరిగి ఇన్ని రోజులైనా హంతకులు కేసు దర్యాప్తు ఇప్పటికీ తేలడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ హత్య కేసును త్వరగా తేల్చాలని సీబీఐని వైఎస్ షర్మిల కోరారు. తద్వారా ఏపీలో సీబీఐ దర్యాప్తు ఆలస్యం కావడంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

ఇక అన్నయ్య అయిన ఏపీ సీఎం జగన్ కు ఈ కేసు విషయంలో షర్మిల ఓ కీలక సలహా ఇచ్చారు. ఈ కేసులో జరుగుతున్న సీబీఐ దర్యాప్తులో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని ఆమె సూచించారు. తద్వారా అధికార పార్టీ తన బలంతో సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయవద్దని షర్మిల కోరారు.

ఇప్పటికే ఈ కేసులో వైఎస్ కుటుంబ పాత్రపై సీబీఐ దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని.. జగన్ ప్రభుత్వ తీరుపై సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు. సీబీఐ అధికారులపైనే ఎదురు కేసులు పెట్టడాన్ని సహించలేకపోతున్నారు.ఈ ఆరోపణల నేపథ్యంలోనే షర్మిల చేసిన సూచన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.