లాక్ డౌన్ ఎఫెక్ట్: పెరుగుతున్న లైంగిక సమస్యలు

Wed May 27 2020 08:00:01 GMT+0530 (IST)

Sexual problems with lockdown

జీవితంలో ఎదగడానికి ఎన్నో ప్లాన్లు.. ఎన్నో లక్ష్యాలు.. కోరికలు.. అన్నీ ఈ మహమ్మారి రాకతో ఆవిరైపోయాయి. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమయ్యాం. ఉరుకుల పరుగులతో జీవించే వారికి కుటుంబంతో కలిసి జీవించే సమయం దొరికింది. కానీ ఇప్పుడది ఎక్కువైంది.మహమ్మారి దెబ్బతో రెండు నెలలుగా అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. బయటకు వెళితే వైరస్ సోకుతుందనే భయం.. ఊడిపోయిన ఉద్యోగాలు.. జీతాలు లేవు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో మానసిక సమస్యలకు దారి తీస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఖాళీ టైంలో దాంపత్య జీవితం బలపడాల్సిన సమయం.. కానీ లేనిపోని మానసిక సమస్యలతో లైంగిక సమస్యలకు కారణమవుతోందని నిపుణులు తేల్చారు. లైంగిక జీవితం సక్రమంగా సాగాలంటే మానసికంగా ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి. మనసు హుషారుగా ఉండి.. ఎటువంటి ఒత్తిళ్లూ ఆందోళనలు లేనప్పుడు లైంగికంగా చురుగ్గా ఉండగలం. కానీ ఇప్పుడు లాక్ డౌన్ తో ఉద్యోగాలు ఊడి జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతో హుషారు పోయింది. ఇలానే కృంగుబాటుతో లైంగిక ఆరోగ్యం దెబ్బతింటోందని పరిశోధనలో తేలింది. ఫలితంగా కోరికలు పటుత్వం తగ్గడం లాంటి లక్షణాలు కొత్తగా మొదలవుతున్నాయని తేల్చింది.

నిజానికి ముందు నుంచి సెక్స్ సమస్యలు లేని వారికి లాక్ డౌన్ మూలంగా కొత్త సమస్యలు తలెత్తడం లేదు. తలెత్తితే ఈ లాక్డౌన్ భయాలు కారణంగా గ్రహించాలి. ఇక లాక్ డౌన్ ఒత్తిడితో ఇప్పటికే లైంగిక సామర్థ్యం లేని వారికి పరిస్థితి మరింత జఠిలమవుతోందని తేలింది.

ఈ సమయంలోనే భార్య/భర్త తమ పార్ట్ నర్ మానసిక సామర్థ్యాన్ని అంచనా వేసుకొని మనసెరిగి ప్రవర్తించాలి. పరిస్థితులు మెరుగు అవుతాయని ధైర్యం చెబుతూ అతడిని ఒత్తిడి నుంచి దూరం చేసి లైంగిక సుఖాన్ని అందించాలి. అప్పుడు తిరిగి పూర్వపు స్థితికి వస్తారు. లేదంటే మానసికంగా శృంగార పరంగా దెబ్బ తింటారని పరిశోధనలో తేలింది.