Begin typing your search above and press return to search.

తెరపైకి సెక్స్ ఛాంపియన్ షిప్... కోచింగ్ కంపల్సరీ!

By:  Tupaki Desk   |   1 Jun 2023 12:00 PM GMT
తెరపైకి సెక్స్ ఛాంపియన్ షిప్... కోచింగ్ కంపల్సరీ!
X
అభివృద్ధిలో భాగమా.. లేక, ఆటవికం వైపు తిరోగమనా అన్న చర్చ సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా సెక్స్ ఛాంపియన్ షిప్ తెర పైకి వచ్చింది. సెక్స్ ఎడ్యుకేషన్ ప్రతీ ఒక్కరికీ అవసరమే అనే స్థానంలో... సెక్స్ ని ఒక క్రీడ గా భావించాలని, ఆ క్రీడకు కూడా టోర్నమెంట్ లు పెడతామని చెబుతుంది స్వీడన్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది.

సెక్స్‌ ను ఒక క్రీడగా గుర్తించి, మొదటి యూరోపియన్ సెక్స్ ఛాంపియన్‌ షిప్‌ ను నిర్వహించడం ద్వారా చరిత్ర సృష్టించబోతోంది స్వీడన్. ఈ దేశంలో సెక్స్ అనేది రహస్య విషయం కానేకాదనే సంఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. ఈ నేపథ్యంలో మరో అడుగుముందుకేసిన స్వీడన్... ఫిఫా వరల్డ్ కప్, ఒలెంపిక్స్, ఐపీఎల్ స్థాయిలో కాకపోయినా... సెక్స్ క్రీడతో ఒక ఛాంపియన్‌ షిప్ ను కండక్ట్ చేయనుంది. అనేక వారాల పాటు కొనసాగే ఈ టోర్నమెంట్ లో పాల్గొనేవారు రోజు కు ఆరు గంటల పాటు పోటీపడాల్సి ఉంటుంది.

ఇక ఈ ఈవెంట్‌ లో 16 విభాగాలు ఉంటాయి.. ప్రజల కు ప్రత్యక్షగా తిలకించ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఐదుగురు జడ్జిల ప్యానెల్ ద్వారా స్కోర్స్ ఇవ్వబడతాయి. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం! ఈ ఈవెంట్ లో సెడిక్షన్, బాడీపార్ట్స్ మసాజ్, ఓరల్ సెక్స్ తో పాటు అత్యంత అందమైన భంగిమ, అతి కష్టమైన భంగిమ, అత్యంత కళాత్మక కమ్యూనికేషన్స్ వంటి విభాగాలు ఉంటాయి. ఇదే క్రమంలో... పోటీ సమయంలో పెరిగిన రక్తపోటు, హృదయ స్పందన రేటు కూడా జడ్జ్ లు పరిగణలోకి తీసుకుని మార్కులు ఇస్తారు!

అయితే ఈ పోటీల్లో... పోటీ సమయంలో అత్యంత చురుకుగా ఉన్న జంట, అలాగే కామసూత్రంలో అత్యంత కళాత్మకంగా ప్రదర్శన ఇచ్చిన జంటల గెలుపు కు అంతిమ నిర్ణేతలుగా జడ్జిలతో పాటు ప్రేక్షకుల అభిప్రాయం కూడా కీలకంగా ఉండబోతోంది. అయితే... బిగ్ బాస్ షో లోలాగా మెసేజ్ లు పంపి తమ కిష్ట మైన జంట ను ప్రమోట్ చేసే ఆప్షన్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఈ విషయాల పై స్పందించిన స్వీడిష్ ఫెడరేషన్ ఆఫ్ సెక్స్ ప్రెసిడెంట్, డ్రాగన్ బ్రాటిచ్... ఈ రోజుల్లో, మారుతున్న జీవనశైలిలో సెక్స్‌ ను క్రీడగా మార్చడం అనివార్యమని అభిప్రాయపడ్డారు. సెక్స్ అనేది మానసిక, శారీరక శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... ఈ పోటీల్లో పాల్గొనేవారు తగినంత శిక్షణ తీసుకుని వస్తే మెరుగైన ఫలితాలు రాబొట్టచ్చని సూచించడం!

ఇక ఈ ఛాంపియన్‌ షిప్ స్వీడన్‌ లోని గోథెన్‌ బర్గ్ సమీపంలో జూన్ 8, 2023 నుండి వివిధ యూరోపియన్ దేశాల నుండి పాల్గొనే వారితో ప్రారంభమవుతుంది.