ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసిన సీరియల్ నటి

Thu Mar 30 2023 10:18:00 GMT+0530 (India Standard Time)

Serial Actress Plan Failed to Kill Husband

పెళ్లితో ఒక్కటైన భార్యభర్తల మధ్య మూడో వ్యక్తి రావటం.. ఈ కారణంగా గొడవలు చోటు చేసుకోవటం పాత విషయమే అయినా.. గతంలో లేనిది ఇటీవల కాలంలో ఎక్కువైన అంశం ఏమైనా ఉందంటే.. అది భర్తల్ని చంపేసే భార్యల ఉదంతాలు ఎక్కువ అవుతున్నాయి. తెలిసి తెలియనితనంలో చేసే ఇలాంటి పనులతో తమ జీవితాలు నాశనం అయిపోతాయన్న విషయాన్ని వారు మర్చిపోతుంటారు. తాజాగా అలాంటి పనే చేసి అడ్డంగా బుక్ అయ్యింది తమిళ టీవీ నటి ఒకరు. భర్తతో పడనప్పుడు వేరుగా ఉండటం వరకు ఓకే. అందుకు భిన్నంగా భర్తను చంపేయాలన్న దుర్మార్గానికి తెగబడిన ఆమె ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్న పరిస్థితి. అసలేం జరిగిందంటే..తమిళ టీవీ నటి.. పలు సీరియల్స్ తో నటిస్తూ సుపరిచితురాలైన రమ్య కట్టుకున్న భర్తను చంపాలని ప్లాన్ చేసి.. అడ్డంగా బుక్ అయ్యింది. కొంతకాలం రమ్యకు రమేశ్ అనే వ్యక్తితో పెళ్లైంది. కొంతకాలంగా ఆమె టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. అయితే.. టీవీ సీరియల్స్ లో నటించటం మానేయాలని.. అది తనకు ఇష్టం లేదని భర్త రమేశ్ కోరాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో.. దంపతుల మధ్య తగాదాలు చోటు చసుకుంటున్నాయి. గొడవలు పెరుగుతున్న నేపథ్యంలో కొద్ది నెలలుగా వీరు విడిగా ఉంటున్నారు.

నటిగా కెరీర్ కొనసాగించాలనుకున్న ఆమె.. పలు సీరియల్స్ లో నటించారు. నటిస్తున్నారు. ఈ క్రమంలో తన సహ నటుడు డేనియల్ అలియాస్ చంద్రశేఖర్ తో ఆమె సన్నిహితంగా ఉండటం మొదలైంది. వారిద్దరు కలిసి రమ్య భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించారు. ఇందులో భాగంగా వారు చంపే ప్లాన్ చేశారు.

దీనికి తోడు రమేశ్ ఉంటున్న ఇంటిని రూ.10లక్షల మొత్తానికి కారు చౌకగా కొట్టేయాలని చూశారు. అయితే.. అందుకు రమేశ్ ససేమిరా అనటంతో ఏదోలా అతన్ని చంపేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా భర్తతో కలిసి రమ్య బైక్ మీద వెళుతున్నవేళ.. గుర్తు తెలియని వ్యక్తి  వారి వాహనాన్ని ఢీ కొట్టటం.. కింద పడిన రమ్య భర్త మెడను బ్లేడ్ తో కోసి పారియాడు.

చుట్టుపక్కల వారు స్పందించటం.. ఆసుపత్రికి తరలించటంతో ప్రాణాపాయం త్రుటిలో తప్పింది.ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించిన పోలీసులకు రమ్య చెబుతున్న సమాధానాలుతేడా ఉండటంతో ఆమెను మరిన్ని ప్రశ్నలు అడగటం.. పొంతనలేని సమాధానాలు చెప్పటంతో అనుమానం పెరిగింది.

ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని పరిశీలించగా.. భర్తను హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిందన్న విషయాన్ని గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కిస్తోంది. చక్కగా సీరియల్స్ చేసుకుంటూ ఉండాల్సిన ఆమె.. తప్పుడు ఆలోచనలతో జీవితం మొత్తాన్ని నాశనం చేసుకుందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.