Begin typing your search above and press return to search.

బాలయ్యలో దేవుడిని చూస్తున్నా.. అలేఖ్య రెడ్డి ఎమోషనల్!

By:  Tupaki Desk   |   21 March 2023 4:39 PM GMT
బాలయ్యలో దేవుడిని చూస్తున్నా.. అలేఖ్య రెడ్డి ఎమోషనల్!
X
సినీ నటుడు తారకరత్న మరణాన్ని ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. లోకేష్ పాదయాత్రలో అస్వస్థతకు గురై దాదాపు 20 రోజులకు పైగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన తారకరత్న మరణం వారి కుటుంబాన్ని కృంగదీసింది. ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్యరెడ్డిని ఒంటరిని చేసింది. తారకరత్నను బతికించేందుకు బాలయ్య బాబు పడిన తపన అంతా ఇంతాకాదని తేలింది. తారకరత్నను బతికించేందుకు బాలయ్య చేయని ప్రయత్నం లేదు. విదేశాల నుంచి వైద్యులను తీసుకొచ్చి మరీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా బాలయ్య బతికించేందుకు తాపత్రయపడ్డాడు.

ఇక తారకరత్న మరణానంతరం కూడా అన్ని కార్యక్రమాలను బాలయ్య దగ్గరుండి మరీ చూసుకున్నాడు. ఇప్పుడు తారకరత్న కుటుంబానికి ఆయనే పెద్ద దిక్కుగా మారారు. తాజాగా బాలయ్య మరో గొప్ప పనిచేశారు. తారకరత్న జ్ఞాపకార్థం బసవతారకం ఆస్పత్రిలో ఒక వార్డుకు ఆయన పేరును బాలయ్య పెట్టారు. అంతేకాదు.. గుండె సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఈ వార్డులో ఉచితంగా వైద్యసేవలను అందించనున్నట్టు బాలయ్య బాబు సంచలన ప్రకటన చేశారు. దీంతో బాలయ్య మంచి మనుసుకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

తారకరత్న కోసం బాలయ్య చేసిన పనికి ఆయన భార్య అలేఖ్యరెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు. 'నేను ఏం చెప్పగలను. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయగలను. బంగారు మనసు కలిగిన గొప్ప వ్యక్తి అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మీరు మాకు తండ్రి, స్నేహితుడి కన్నా ఎక్కువ. ఇప్పుడు మీలో దేవుడిని చూసుకుంటున్నాను. మీ మంచితనాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో.. అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. జై బాలయ్య' అంటూ అలేఖ్య రాసిన ఏమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.

తారకరత్న మరణించి నెలరోజులు అయిన సందర్భంగా ఆయన భార్య అలేఖ్యరెడ్డి ఇటీవలే జ్ఞాపకాలు పంచుకున్నారు. భర్తతో అనుబంధాన్ని.. తాము అనుభవించిన బాధలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఆమె పంచుకున్న ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తాము జీవితంలో పెళ్లి చేసుకోవడానికి, బతకడానికి ఎంత కష్టపడ్డామన్నది వివరించారు.

సరిగ్గా నెల రోజుల క్రితం, అంటే ఫిబ్రవరి 18న మరణించిన దివంగత నటుడు నందమూరి తారకరత్నను సతీమణి అలేఖ్యారెడ్డి స్మరించుకొని ఏమోషనల్ అయ్యారు. అతని ఆకస్మిక మరణంతో దుఃఖంలో ఉన్న భార్య , అతని ముగ్గురు పిల్లల బాధను ఇన్ స్టాగ్రామ్ లో వ్యక్తం చేశారు.

అలేఖ్య తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తన భావాలను వ్యక్తం చేస్తున్నారు. 'యువగళం' పాదయాత్రలో తారకరత్న కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. 28 రోజుల పాటు పోరాడి తుది శ్వాస విడిచారు. తమ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలబడ్డ బాలయ్యను తాజాగా దేవుడితో పోల్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.