నగ్నంగా తిరగడానికి సైంటిస్ట్ కు అనుమతి..

Tue Feb 07 2023 21:00:01 GMT+0530 (India Standard Time)

Scientist allowed to roam naked

ఆయన బట్టల్లేకుండా వీధుల్లో తిరగొచ్చు.. అతనిని ఎవరూ అడ్డుకోవద్దు.. అంటే ఓ న్యాయస్థానం తీర్పునిచ్చింది. రోడ్డుమీద మతి స్థిమితం లేని వాళ్లు మినహా ఇతరులు నగ్నంగా తిరిగినే న్యూసెన్స్ కేసు పెడుతారు. ఆ తరువాత కోర్టులో హాజరు పరిచి తీవ్రతను భట్టి జరిమానా లేదా శిక్ష విధిస్తారు. కానీ ఆ స్పెయిన్ న్యాయస్థానం మాత్రం అతని వాదనను అంగీకరించింది. తాను బట్టల్లేకుండా ఎక్కడైనా తిరగొచ్చు అంటూ సంచలన తీర్పునిచ్చింది. ఇంతకీ ఆ వ్యక్తి బట్టల్లేకుండా ఎందుకు తిరగాలనుకుంటున్నాడు..? అసలేంటి కథ?అలెజాండ్రో కొలోమార్ అనే వ్యక్తి  చిన్నప్పటి నుంచి స్పెయిన్ లోని న్యూడిస్ట్ బీచ్ లకు వెళ్తున్నాడు. ఈ వెదర్ అలవాటు చేసుకున్న ఆయన 29 ఏళ్ల వయసు వచ్చినా.. అలాగే ఉండాలనుకున్నాడు. ఇందులో భాగంగా 2020లో ఆయన స్పెయిన్ లోని వాలెన్సియా పట్టణంలోని వీధుల గుండా నగ్నంగా తిరిగాడు. 1988 కోర్టు తీర్పు ప్రకారం స్పెయిన్ లోని చాలా ప్రాంతాల్లో బహిరంగ నగ్నత్నం అనేది నేరం కాదు. కానీ బార్సిలోనా పల్లా డోలిడ్ వంటి కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఇవి వర్తించదు. అలెజాండ్రో స్వస్థలం అల్డాయా లో ఈ రూల్స్ ఉన్నాయి. కానీ ఆయన నగ్నంగా తిరగడంతో ఈ విషయం కోర్టు వరకు వెళ్లింది.

అయితే అలెజాండ్రో కేసు వాలెన్సియాలోని స్పానిష్ కోర్టు టేకాప్ చేసి అతని చర్యను సమర్థించింది. ఈ సందర్భంగా అలెజాండ్రో చేసిన వాదనను ఓకే చెప్పింది. తాను అల్డాయాలోని రెండు వేర్వేరు వీధుల్లో వేర్వేరు సమయాల్లో నగ్నంగా తిరగడానికి పరిమితం చేసుకున్నానని అన్నాడు. తన చర్యల వల్ల ఎవరికి ఇబ్బందులు కలగలేదని తెలిపారు.అలెజాండ్రో చేసిన పని చట్ట విరుద్ధం కాకపోయినా విపరీతమైన నగ్నత్వాన్ని కవర్ చేసేందుకు కొన్ని నగర చట్టాలను ఉల్లంఘిచారని ఆయనపై కేసు నమోదైంది.

అలెజాండ్రో న్యాయస్థానంలోకి కూడా నగ్నంగా వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ దుస్తులు వేసుకున్న తరువాతే అతనికి అనుమతి ఇచ్చారు. ఆ తరువాత పూర్తిగా విచారించిన తరువాత ఆయనకు నగ్నంగా తిరిగే స్వేచ్ఛను కోర్టు ప్రసాదించింది. కానీ కొన్ని రూల్స్ పాటించనందుకు  రూ. 250000 జరిమానా విధించింది. వాలెన్సియాలోని స్పానిష్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైప అలెజాండ్రో వంటి వారు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.