Begin typing your search above and press return to search.

కరోనా వేళలో వందల కోట్లు వెనకేసిన ఘనులు

By:  Tupaki Desk   |   12 July 2020 10:10 AM GMT
కరోనా వేళలో వందల కోట్లు వెనకేసిన ఘనులు
X
ఒకే సమయంలో ఒకే రకంగా ప్రపంచదేశాలన్ని ఉక్కిరిబిక్కిరి అయిపోయిన మొట్టమొదటి అనుభవం కరోనా కారణంగా వచ్చిందని చెప్పాలి. అది.. ఇది అన్న తేడా లేకుండా అన్నిరకాల వ్యాపారాల్ని మాత్రమే కాదు.. పేద వాడు మొదలు కోట్లాది రూపాయిలున్న సంపన్నుడి వరకూ షాకిచ్చింది కంటికి కనిపించని మాయదారి వైరస్. కరోనా కారణంగా వేలాది కోట్లు నష్టపోయిన వారెందరో. ఇలాంటివేళలోనూ.. కోట్లు సంపాదిస్తున్న వారికి కొదవలేదు. కరోనా కారణంగా కొత్త రంగాలకు.. ఇప్పటివరకూ పెద్దగా ఛరిష్మా లేని రంగాలకు చెందిన వారి ఆస్తులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున పెరిగాయి.

చేతికి తొడుక్కునే గ్లవ్స్ తయారు చేసే సంస్థల రూపురేఖలు మొత్తంగా మారిపోయాయి. మలేషియాలో రబ్బర్ గ్లవ్స్ తయాచు చేసే సూపర్ మాక్స్ కంపెనీ తొలిసారిగా బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన్లుగా బ్లూమ్ బర్గ్ పేర్కొంది. కరోనా కారణంగా ఈ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 400రెట్లు పెరిగాయి. దీంతో.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు థాయ్ కిమ్ సిమ్ బిలియనీర్ల క్లబ్ లో చేరారు. ఆయన బాటలోనే టాప్ గ్లవ్స్ కంపెనీ ధర సుమారురెండున్నర రెట్లు పెరిగిపోవటంతో ఆ సంస్థ అధినేత లిమ్ వీ చాయ్ కూడా బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరారు.

కరోనా కారణంగా దేశాలకు దేశాలు లాక్ డౌన్ విధించటంతో అందరూ వీడియో కాన్ఫరెన్సు బాట పట్టటంతో అమెరికాకు చెందిన జూమ్ యాప్ ఎంతలా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ కారణంతోనే జూమ్ యాప్ సృష్టికర్త ఎరిక్‌ యువాన్‌ ఆస్తి విలువ మూడు నెలల స్వల్ప వ్యవధిలో ఏకంగా రూ.19,350 కోట్లకుపెరిగింది.

లాక్ డౌన్ కారణంగా ఆన్ లైన్ అమ్మకాలు పెరిగిపోవటంతో వాల్ మార్ట్.. అమెజాన్ లాంటి కంపెనీల సుడి తిరిగిపోయింది. వారి సంపద కూడా వేలాది కోట్లు పెరిగింది. అంతేకాదు.. ఫార్మా కంపెనీలకు కాసులు పండుతున్నాయి. సర్జికల్ వస్తువుల్ని తయారు చేసే సంస్థలు భారీ ఎత్తున లాభాల్ని సొంతం చేసుకుంటున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. ఎవరిదాకానో ఎందుకు రిలయన్స్అంబానీ తన జియో వాటాను అమ్మి కంపెనీకి ఉన్న భారీ అప్పును తీర్చేయటం మరో ఉదాహరణగా చెప్పొచ్చు.