ఆకాశంలో అద్భుతం ... మిస్ అయితే మళ్లీ 2400 వ సంవత్సరం లో !

Sat Nov 21 2020 17:20:55 GMT+0530 (IST)

Awesome in the sky ... miss but again in the 2400th year!

ఆకాశంలో చాలా అరుదుగా కొన్ని అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. అయితే అలాంటి అద్భుతాల్ని ఒక్కసారి చూడటం మిస్ అయితే మళ్లీ జీవితంలో ఇక ఆ ఛాన్స్ రాకపోవచ్చు. అలా జీవితంలో మళ్లీ చూడలేని ఓ అద్భుత దృశ్యం డిసెంబర్ 21 న కనువిందు చేయబోతుంది. రాబోయే నెలలో తొలిసారి శని బృహస్పతి రెండుగ్రహాలు కలిసి ఒకేచోట డబుల్ ప్లానెట్ గా దగ్గరగా కనిపించ నున్నాయి. డిసెంబర్ 21న సాయంత్రం సూర్యాస్తమయం 6 గంటల తరువాత ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించవచ్చు. భూమిపై నుంచి రాత్రి ఆకాశంలో చూస్తే బృహస్పతి శని గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా కనిపిస్తాయి. ఈ రెండు గ్రహాల మధ్య కలయిక చాలా అరుదుగా సంభవిస్తుంటుంది.అయితే గ్రహాలు ఒకదానికొకటి ఇంత దగ్గరగా కనిపించడం చాలా అరుదుగా జరుగుతుందని రైస్ యూనివర్శిటీ ఖగోళ శాస్త్రవేత్త పాట్రిక్ హర్తిగాన్ చెప్పారు. 1226 సంవత్సరంలో మార్చి 4న తెల్లవారుజామున ఆకాశంలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. వేసవి కాలం నుంచి బృహస్పతి శని భూ గ్రహాలు ఆకాశంలో ఒకదానికొకటి సమీపిస్తున్నాయి. డిసెంబర్ 21న సాయంత్రం ఈ రెండు గ్రహాలు డబుల్ ప్లానెట్ గా కనిపిస్తాయి. పూర్తి చంద్రుని వ్యాసంలో 1/5వ వంతు మాత్రమే వేరుగా కనిపిస్తాయని భౌతిక శాస్త్ర ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ హర్తిగాన్ అన్నారు. ఆకాశంలో కనిపించే ఈ అరుదైన దృశ్యాన్ని టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు.

భూమధ్యరేఖకు సమీపంలో ఉన్నప్పటికీ.. ఈ దృశ్యం భూమిపై ఎక్కడైనా కనిపించవచ్చు. ప్రతి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ఒక గంట పాటు పశ్చిమ ఆకాశంలో గ్రహ ద్వయం తక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. సంధ్యా సమయంలోనూ గ్రహాలను చూడగలిగేంత ప్రకాశవంతంగా ఉంటాయని చెబుతున్నారు. అమెరికాలో ఉండేవారికి ఈ అరుదైన దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యాస్త సమయానికి ఒక గంట తరువాత న్యూయార్క్ లేదా లండన్ లో ఆకాశంలో ఈ రెండు గ్రహాలను వరుసగా 7.5 డిగ్రీలు 5.3 డిగ్రీల కోణంలో దగ్గరగా చూడొచ్చు. ఈ రెండు గ్రహాలు మళ్లీ 2400 సంవత్సరం తర్వాత ఒకే చోట కనిపించే అవకాశం ఉంది.