Begin typing your search above and press return to search.

ఏపీ ఒక ప్రయోగ శాల.. అదిరిపోయే రిసెర్చ్ ?

By:  Tupaki Desk   |   9 Dec 2021 8:33 AM GMT
ఏపీ ఒక ప్రయోగ శాల.. అదిరిపోయే రిసెర్చ్  ?
X
ఏపీ ఇపుడు ఒక ప్రయోగ శాలగా మారుతోంది. అవును ఇది నిజమే. ఏపీ విభజన తరువాత ఏపీ రూపమే ఒక్కసారిగా మారిపోయింది. ఆదాయం లేదు, చెల్లింపులు మాత్రం తప్పని పరిస్థితి. దాంతో అప్పుల కుప్పగా ఏపీ మారిపోయింది. చంద్రబాబు టైమ్ లో రెండున్నర కోట్లు అప్పు తెచ్చారు. ఆనాడు ఆర్ధిక మంత్రి యనమల రామక్రిష్ణుడు అప్పులు తేవడానికి ఎంతో శ్రమించారు. ఆయన దిగిపోతూ వంద కోట్లను మాత్రమే ఖజనాలో ఉంచేశారు.

ఏపీకి అప్పులు పుట్టవని కూడా యనమల అప్పట్లో పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే జగన్ సర్కార్ వచ్చి అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వెళ్తోంది. రెండున్నరేళ్ల కాలంలోనే మూడు లక్షలకు పైగా అప్పులు జగన్ ప్రభుత్వం చేసిందని చెబుతున్నారు. మరి ఇన్ని అప్పులు ఎలా చేస్తున్నారు, అప్పులు ఇలా కూడా చేయవచ్చా ఇత్యాది ప్రశ్నలు అందరిలో కలిగేలా జగన్ సర్కార్ దూకుడు ఉంది అంటున్నారు.

ఏపీలో అప్పులకు అదీ ఇదీ కాదు అన్నీ తాకట్టు పెట్టేశారు. ఈ రోజు కాదు మరో పాతికేళ్లకు వచ్చే ఆదాయాన్ని, మద్యం అమ్మకాలను చూపించి మరీ అప్పులు తెస్తున్నారు. ఈ రుణ భారతాన్ని వివరించాలీ అంటే ఎంతైనా ఉంది. ఎన్ని విన్యాసాలైనా చేసి మరీ అప్పులు తెచ్చేస్తున్నారు.

దానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్న మాటనే తీసుకుంటే ఎవరైనా అప్పులు ఇస్తామని చెబితే చాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని. అంటే అప్పు ఇచ్చిన వారు పెట్టే కండిషన్లు, కానీ కఠిన నియమాలు కానీ ఖాతరు లేకుండా అప్పులు చేయడం ఒక్క ఏపీకే చెల్లింది అంటున్నారు.

ఇక ఇన్నేసి అప్పులు ఇన్ని విధాలుగా తేవచ్చా అని దేశంలోని ఇతర రాష్ట్రాలు సైతం ఆశ్చర్యపోయేలా ఏపీ సర్కార్ తీరు ఉందని కూడా సెటైర్లు వస్తున్నాయి అంటే ఆలోచించాలేమో. ఇది అప్పుల వ్యవహారం అయితే పన్నుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం కొత్త పుంతలు తొక్కింది అంటున్నారు. కాదేదీ పన్నులకు అనర్హం అన్న తీరున పన్నుల బాదుడు ఉందని విమర్శలు ఉన్నాయి.

ఇపుడు కొత్తగా రియల్టర్ల మీద కూడా బాదుడు స్టార్ట్ చేశారు అంటున్నారు. కొత్తగా లే అవుట్లు వేసే వారు అయిదు శాతం స్థలం కానీ దానికి సరి సమానమైన మార్కెట్ రేట్ కానీ ప్రభుత్వానికి జగనన్న కాలనీల కింద చెల్లించుకోవాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను చూసిన వారు ఎవరైనా ఇలాగ కూడా బాదేయవచ్చా అని షాక్ కి గురి అవుతున్నారు. దీని వల్ల ఇండైరెక్ట్ గా మధ్యతరగతి వర్గాలే టార్గెట్ అవుతారు.
వారు ఎక్కడైనా స్థలం కొనుగోలు చేసుకోవాలంటే ఈ బాదుడు వారి ఖాతాలోకే జమ‌ పోతుంది అన్నది పరమ సత్యం.

మరో వైపు చూస్తే ఓటీఎస్ అన్నది కూడా ఒక రకమైన బాదుడే అంటున్నారు. ఎపుడో ఎన్టీయార్ టైమ్ లో కట్టిన ఇళ్ళ నుంచి నేటి వరకూ రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు చెల్లించాలని డిమాండ్ పెట్టడం అంటే ముక్కు పిండి వసూల్ తప్ప మరోటి కానే కాదని అంటున్నారు. పైగా ఇవన్నీ పేదల కాలనీలు. మరి ఏ సెక్షన్ అయినా టార్గెట్ అయినా బే ఫికర్ అన్నట్లుగానే పాలకుల తీరు ఉందని అంటున్నారు.

చూడబోతే ఆదాయం పెంచుకోవడం కోసం, ఖజానాని నింపుకోవడం కోసం ఫ్యూచర్ లో ఇంకెన్ని కొత్త ఆలోచనలతో పాలకులు ముందుకు వస్తారో అన్న డౌట్లు అయితే అందరిలో వచ్చేస్తున్నాయి. మొత్తానికి ఏపీ అభివృద్ధి మీద రిసెర్చ్ చేయడం మాట అటుంచి ఏపీకి కొత్త అప్పులు ఎలా పుట్టించాలి, కొత్తగా ఏ రకంగా బాదుడు ఉండాలి అన్న దాని మీద అద్భుతమైన పరిశోధనే సాగుతోంది అని కామెంట్స్ అయితే పడుతున్నాయి.