Begin typing your search above and press return to search.

కోజికోడ్ ప్రమాదం : శాటిలైట్ ఫోటోలు విడుదల..నీలిరంగులో విమానం!

By:  Tupaki Desk   |   13 Aug 2020 4:45 AM GMT
కోజికోడ్ ప్రమాదం : శాటిలైట్ ఫోటోలు విడుదల..నీలిరంగులో విమానం!
X
కేరళ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. వందే భారత్ మిషన్ లో భాగంగా.. దుబాయ్‌ నుంచి టేకాఫ్ తీసుకున్న ఎయిరిండియా ఎక్స్‌ ప్రెస్ విమానం కేరళ కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకోగానే క్రాష్ ల్యాండ్ అయ్యి రెండుముక్కలు అయిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ సమయంలో రన్‌ వే పైనుంచి పక్కకు జారిపోయింది. దీంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ప్రమాదం అనంతరం బోయింగ్ B737 విమానం రెండు ముక్కలైంది. శుక్రవారం (ఆగస్టు 7) రాత్రి 7.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఆ విమానాన్ని నీలిరంగు కవర్‌ తో కప్పి ఉంచినట్టుగా ఉపగ్రహం విడుదల చేసిన చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ ఉపగ్రహ చిత్రాలను ప్రముఖ అంతరిక్ష సంస్థ మక్సర్ టెక్నాలజీస్ మంగళవారం రోజున తీసింది. సాటిలైట్ తీసిన ఆ ఫోటోలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే వాతావరణం నుంచి దీన్ని జాగ్రత్తగా భద్రపరిచినట్లు తెలుస్తోంది. దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి, ఈ విమానంను సురక్షితంగా ఉంచాలని భావించి అధికారులు దాన్ని శిథిలాలను భద్రపరిచినట్లు తెలుస్తోంది. రన్‌ వే కు కొంచెం దూరంలో ఈ విమానం నీలిరంగు కవర్‌ తో కప్పబడి ఉంది. విమానంతో పాటుగా ఆ ఘటనా స్థలంలో ఓ రెండు క్రేన్లు - ఒక ట్రక్కులు ఉన్నట్లుగా శాటిలైట్ ఫోటోస్‌ లో కనిపిస్తోంది.

ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లతో సహా 18 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. ఘటనపై దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశించింది. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. ప్రమాద సమయంలో బోయింగ్ విమానంలో సిబ్బంది సహా 190 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు పైలట్లు, నలుగురు క్య్రూ సిబ్బంది సహా 10 మంది చిన్నారులు, 174 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇకపొతే విమానంలో కీలకంగా ఉండే బ్లాక్‌ బాక్స్‌ ను విచారణాధికారలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్లాక్ ‌బాక్స్ ‌ను డీకోడ్ చేస్తే ప్రమాదం పై కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంతవరకు ఎలాంటి వదంతులు పుట్టించరాదని కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున ప్రమాదం పై ఎలాంటి ప్రకటన చేయలేమని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ అరబిందో హందా చెప్పారు.