Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రిపై సంచలన వీడియో.. కానీ, అనుమానాలేంటంటే!
By: Tupaki Desk | 6 Feb 2023 5:12 PMఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయో.. అందరికీ తెలిసిందే. సొంత పార్టీలోనే నేతలు కుమ్మేసుకుంటున్నా రు. ఒకరంటే ఒకరికి పడడం లేదు. పైగా.. మంత్రులుగా ఉన్న వారు కూడా.. తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎక్కడా పరపతి లేదని.. తమ మాట నెగ్గడం లేదని.. తాడేపల్లి నుంచి చక్రం తిప్పుతు న్నారని.. ఇలా మంత్రులుగా ఉన్నవారు కూడా మధన పడుతున్నారు. ఇదిలావుంటే.. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే, మంత్రి మేరుగ నాగార్జునపై సంచలన ఆరోపణలు చేస్తూ.. మాజీ సర్పంచి భర్త ఒకరు విరుచుకుపడ్డారు. కాంట్రాక్టు పనుల బిల్లులు చెల్లించనివ్వకుండా నాగార్జున అడ్డు పడుతున్నారని.. దళితులను వేధిస్తున్నారంటూ ముల్పూరు మాజీ సర్పంచ్ భర్త మాణిక్య రావు ఓ వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తన భార్య సర్పంచ్ గా ఉన్న సమయంలో గ్రామంలో రోడ్లు వేశామని.. ఆ రోడ్లకు సంబంధించిన బిల్లులు రాకుండా మంత్రి నాగార్జున అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
అప్పుల బాధతో మానసికంగా కుంగిపోయి వీడియో చేసినట్లు మాణిక్యరావు వెల్లడించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే.. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అదేంటంటే.. అగ్రవర్ణాల చేతిలో మంత్రి మేరుగ కీలు బొమ్మగా మారాడని, వారే ఆయనను ఆడి స్తున్నారని ఆరోపించారు.
ఇదే ఇప్పుడు చర్చకు దారితీసేలా చేసింది. ఎందుకంటే..అసలు సమస్య కంటే కూడా.. మంత్రిని అగ్రవ ర్ణ నాయకులు ఆడిస్తున్నారో.. లేదో.. ఆయనకు అనవసరం.
కానీ, ఈ వ్యాఖ్యలు చేశాడంటే.. దీని వెనుక... ఉద్దేశ పూర్వకంగా ఎవరో వ్యాఖ్యలు చేయించారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. కొన్నాళ్లుగా మంత్రి మేరుగ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన ప్రోత్బలంతోనే ఈ వ్యాఖ్యలు వెలుగు లోకి రావడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.