శివసేన యువ పులికి బాలీవుడ్ లో మద్దతు

Wed Oct 16 2019 16:05:44 GMT+0530 (IST)

శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే.. మహారాష్ట్ర వాసులు మరాఠీల సంక్షమమే లక్ష్యంగా పార్టీని నడిపించారు. ఆయన మరణం తరువాత  బాల్ థాకరే కుమారుడు ప్రస్తుత శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే కూడా అదే పనిచేస్తున్నారు.. వీరిద్దరూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు. కేవలం పార్టీని నడిపిస్తూ కీలక శక్తిగా ఉన్నారు. అయితే వారి వారసులు మాత్రం అలా ఉండడానికి ఇష్టపడడం లేదు.ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో బరిలోకి దిగాడు.  ఠాక్రే కుటుంబానికి చెందిన మూడో తరం యువనేత .. శివసేన యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే రాజకీయాల్లోకి వచ్చారు. వర్లీ నియోజకవర్గం నుంచి ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.

శివసేన కుటుంబం నుంచి దూసుకొచ్చిన ఆదిత్యథాకరాకు బాలీవుడ్ నుంచి మద్దతు దక్కుతోంది. ఆదిత్య థాకరేకు తాజాగా మద్దతు ప్రకటించారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ఆదిత్య లాంటి యువకుడు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందన్నారు. శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ థాకరేతో తన కుటుంబానికి గొప్ప అనుబంధముందని.. బాలాసాహెబ్ తనకెంతో మేలు చేశాడని సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. థాకరేల కుటుంబం నుంచి మొట్టమొదట ఎన్నికల్లో అడుగుపెడుతున్న ఆదిత్య థాకరేకు ఆల్ ది బెస్ట్ అని మద్దతు ప్రకటించారు సంజయ్ దత్.