Begin typing your search above and press return to search.

సానె ఓబుళ‌రెడ్డి ఎలాంటి వ్య‌క్తి? ర‌క్త‌చ‌రిత్ర‌కు మ‌రో కోణం!

By:  Tupaki Desk   |   17 Dec 2019 1:30 AM
సానె ఓబుళ‌రెడ్డి ఎలాంటి వ్య‌క్తి? ర‌క్త‌చ‌రిత్ర‌కు మ‌రో కోణం!
X
దాదాపు ద‌శాబ్దం కింద‌ట వ‌చ్చి సంచ‌ల‌నం రేపిన సినిమా *ర‌క్త‌చ‌రిత్ర‌*. అనంత‌పురం జిల్లా ఫ్యాక్ష‌న్ రాజ‌కీయం రాజ‌కీయం మీద‌ - ప‌రిటాల‌- మ‌ద్దెల‌చెరవు - సానె కుటుంబాల మ‌ధ్య‌న సాగిన నాటి ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల గురించి రామ్ గోపాల్ వ‌ర్మ ఆ సినిమాను రూపొందించాడు.

ఆ సినిమా విడుద‌ల‌కు ముందే బోలెడంత వివాదాస్ప‌దం అయ్యింది. విడుద‌ల త‌ర్వాత మాత్రం అటు ప‌రిటాల‌ - ఇటు మ‌ద్దెల‌చెరువు సూరి వ‌ర్గాలు.. రెండూ ఆ సినిమా విష‌యంలో కాంప్ర‌మైజ్ అయ్యాయి. ఫ‌స్ట్ పార్టులో ప‌రిటాల ర‌విని హీరోగా చూపితే - తెలివిగా రెండో పార్టులో వ‌ర్మ సూరిని హీరోగా చూపించారు. ఆ రెండు పాత్ర‌ల‌నూ ప్ర‌ముఖ న‌టుల చేత వేయించి.. వ‌ర్మ తెలివిగా మేనేజ్ చేశాడు.

అయితే సినిమా అన్నాకా విల‌న్ ఉండాలి అన్న‌ట్టుగా బుక్కారెడ్డి పాత్ర రూపంలో సానె ఓబుళ రెడ్డిని విల‌న్ గా చూపించాడు ఆర్జీవీ. అతి కిరాక‌త‌క‌మైన విల‌న్ గా సానె ఓబుళ రెడ్డి పాత్ర‌ను బుక్కారెడ్డి పేరుతో చూపించాడు ఆ ద‌ర్శ‌కుడు. అప్ప‌టి వ‌ర‌కూ ఓబుళ‌రెడ్డి గురించి ప‌త్రిక‌ల్లో అనేక వార్త‌లు వ‌చ్చాయి, ఆ సినిమాతో ఆయ‌న పాత్ర పేరు మ‌రింత‌గా మార్మోగింది.

అయితే ఇంత‌కీ ఓబుళ‌రెడ్డి ఎలాంటి వ్య‌క్తి? ఆయ‌నపై ఉన్న కేసులెన్ని? అస‌లు సానె కుటుంబానికి, పరిటాల కుటుంబానికి మ‌ధ్య రాజ‌కీయ వైరం ఎలా మొద‌లైంది? అది ఫ్యాక్ష‌న్ గా ఎలా మారింది? వ‌ంటి అంశాల‌న్నీ ఆస‌క్తిదాయ‌క‌మైన‌వే. ఆ అంశాల గురించి సానె ఉమారాణి, అంటే ఓబుళ‌రెడ్డి సోద‌రి.. త‌మ వెర్ష‌న్ చెప్పారు ఒక తాజా ఇంట‌ర్వ్యూలో. ర‌క్త‌చ‌రిత్ర సినిమాలో రెండు కోణాలు చూపించారు..అనంత‌పురం ఫ్యాక్ష‌న్ చ‌రిత్ర‌కు సంబంధించి ఇది మ‌రో కోణం. అప్ప‌టి ఫ్యాక్ష‌న్ ఉద్రిక్త‌త‌ల గురించి సానె కుటుంబీకుల ఆస‌క్తిదాయ‌క‌మైన వెర్ష‌న్ ఈ ఇంట‌ర్వ్యూలో ఉంది.