వైసీపీ నుంచి సస్పెన్షన్ను గురైన గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. చుట్టూ మరింత వివాదాలు ముసురుకున్నాయి. ఆమెకు నిన్న మొన్నటి వరకు అనుచరుడిగా ఉన్న సందీప్ అనే వ్యక్తి.. తాజాగా మరిన్ని వ్యాఖ్యలు సంధించారు. ఉండవల్లి శ్రీదేవి.. ఇంట్లో ఉన్న ఫ్రిజ్జు ఏసీ.. ఇతర ఫర్నిచర్ అంతా కూడా కార్యకర్తలుగా తాము కొనిచ్చినవేనని ఆయన చెప్పారు. అంతేకాదు.. ఆమె ఒంటిపై ఉన్న నగలు కూడా తామిచ్చినవేనన్నారు.
ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి.. తన భర్తను కుమార్తెను మీడియా ముందుకు తీసుకువచ్చి వైసీపీపై అవాకు లు చవాకులు పేలుతున్నారని.. దీనిని తాము ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. మరింత దూకుడుగా ముందుకు వెళ్తే.. తాము కూడా.. అంతే దూకుడు ప్రదర్శించాల్సి ఉంటుందని సందీప్ హెచ్చరించారు. తాము కొనిచ్చిన వాటిని వెనక్కి తీసుకుంటామని.. అప్పుడు ఏం చేస్తారో చెప్పాలని.. ఆయన సవాల్ విసిరారు.
ఇటీవల.. ఉండవల్లి కార్యాలయంలో ఉన్న ప్రచార రథాన్ని కార్యకర్తలు.. తీసుకువెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మీడియా ప్రశ్నించగా.. తామే కొనిచ్చామని.. చందాలు కూడా వేసుకున్నామని.. సందీప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఉండవల్లి ఇప్పటి వరకు స్పందించలేదు. ఇకఇప్పుడు మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సందీప్.
ఉండవల్లి శ్రీదేవి ఏదైనా ఫంక్షన్లకు వస్తే.. కానుక కోరేవారని.. అది కూడా లక్షల్లోనే ఉండేదని.. సందీప్ చెప్పుకొచ్చారు. తన ఇంట్లోఫంక్షన్కు పిలిచినా.. మూడు లక్షల రూపాయల విలువైన ఉంగరం గిఫ్ట్గా ఇవ్వాలని కోరారన్నారు.
ఇప్పుడు తేడాగా మాట్లాడితే మరిన్ని విషయాలు కూడా బయటకుచెప్పాల్సి ఉంటుందన్నారు. కాగా.. ఇటీవల ఉండవల్లి శ్రీదేవి భర్త.. శ్రీధర్ కూడా..ఉండవల్లి శ్రీదేవికి ఖర్చుల కోసం.. తాను డబ్బులు పంపించినట్టు చెప్పారు. మరి.. ఈ పరిణామాలు చూస్తే.. శ్రీదేవి ఖర్చుపై సర్వత్రా చర్చ సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.