ఆల్ టైమ్ గ్రేట్ జాబితాలో సచిన్

Tue Jun 22 2021 17:00:02 GMT+0530 (IST)

Sachin on the All Time Great list

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టాలెంట్ గురించి ఇప్పుడు చెప్పాల్సిన పనిలేదు. రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్ భారాన్ని తన భుజస్కంధాలపై మోసిన సచిన్.. ఎన్నో టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించడంలో బలమైన పాత్ర పోషించాడు.అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన ఏకకై ఆటగాడిగా చరిత్ర సృష్టించిన సచిన్.. ఇండియన్ క్రికెట్ మీదనే కాకుండా.. మొత్తం ప్రపంచ క్రికెట్ మీద కూడా తనదైన ప్రభావం చూపించారు. క్రీడారంగంలో విశేష సేవలందించినందుకుగానూ భారత ప్రభుత్వం భారత రత్న అవార్డుతో సత్కరించింది.

కాగా.. ప్రముఖ స్పోర్ట్స్ టీవీ ఛానల్.. స్టార్ స్పోర్ట్స్ 'ఆల్ టైమ్ గ్రేట్' జాబితాను రూపొందించింది. ఇందులో గ్రేటెస్ట్ బ్యాట్స్ మెన్ ఆఫ్ లైఫ్ టైమ్ జాబితాలో సచిన్ అగ్రస్థానం దక్కించుకున్నాడు. సచిన్ తోపాటు కలిస్ స్మిత్ రికీ పాంటింగ్ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు.

ఇక అత్యుత్తమ బౌలర్ల విభగంలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అగ్ర స్థానంలో నిలిచారు. షేన్ వార్న్ మెక్ గ్రాత్ స్టెయిన్ వంటి స్టార్ బౌలర్లు కూడా ఈ జాబితాలో స్థానం పొందారు.