కెమెరాకు చిక్కిన రష్యాక్షిపణి దాడి.. పార్క్ నుంచి జనాల పరుగులు

Wed Jun 29 2022 14:16:56 GMT+0530 (IST)

Russian missile attack on camera Crowds run from the park

ఉక్రెయిన్ పై ఇప్పటికీ రష్యా యుద్ధం ఆగడం లేదు. పచ్చగా ఉన్న నగరాలపైకి కూడా క్షిపణులను ప్రయోగిస్తూ రష్యా ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. సోమవారం ఉక్రేనియన్ నగరమైన క్రెమెన్‌చుక్‌పైకి క్షిపణి దూసుకెళ్లిన క్షణాన్ని ఒక సీసీటీవీ ఫుటేజీ కెమెరాలో బంధించింది. ఈ దాడిలో కనీసం 18 మంది పౌరులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు నివేదించబడింది. దాడిలో ఒక షాపింగ్ మాల్ మరియు సమీపంలోని ఫ్యాక్టరీలో కొంత భాగాన్ని ధ్వంసం చేసింది.స్థానిక ఉద్యానవనంలోని సీసీటీవీ ఫుటేజీలో ఈ భీకర క్షిపణి దాడి రికార్డ్ అయ్యింది. మొదటి క్షిపణి ఆమ్‌స్టర్ షాపింగ్ సెంటర్‌ను పేల్చివేసిన తర్వాత ఆమ్‌స్టోర్ షాపింగ్ సెంటర్ పై రెండోసారి క్షిపణి పేల్చివేయడంతో అగ్నిమాపక కాంతి  షాక్‌వేవ్ కు పార్క్ లోని జనాలు ఎగిరి అవతలపడ్డారు. శిధిలాలు సమీపంలోని సరస్సులోకి వచ్చి పడ్డాయి. షాపింగ్ సెంటర్‌కు ఉత్తరంగా 600 మీటర్ల దూరంలో ఉన్న ఒక చెరువు దగ్గర ఫ్యాక్టర్ బిల్డింగ్‌కి అవతలి వైపున ఆ ప్రాంతంలో రెండు క్షిపణి దాడులు వీడియో రికార్డ్ అయ్యాయి.

సీసీటీవీ వీడియోలో రెండు క్షిపణులు పేలిన ఖచ్చితమైన ప్రదేశాలను ఆ ప్రాంతం  వైమానిక చిత్రాలతో సరిపోల్చడం ద్వారా ఒక క్షిపణి షాపింగ్ సెంటర్ తూర్పు చివరకి దగ్గరగా తగిలిందని తేలింది. మరొకటి కర్మాగారం ఉత్తర చివరను తాకినట్లు కనిపిస్తోంది. సరస్సు యొక్క దక్షిణ అంచు దగ్గర మరొకటి పేలగా పార్క్ లో సేదతీరుతున్న వారు భయంతో పరుగులు తీశారు.

రష్యా మంగళవారం షాపింగ్ మాల్‌ను క్షిపణులతో కొట్టడాన్ని ఖండించింది. సమీపంలోని యుఎస్.. యూరోపియన్ ఆయుధాల డిపోను తాకినట్లు పేలుడు సంభవించిందని.. ఇది మాల్‌లో మంటలను రేకెత్తించిందని పేర్కొంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ నగరంలో చట్టబద్ధమైన సైనిక లక్ష్యాన్ని చేధించిందని..షాపింగ్ సెంటర్ ఉపయోగంలో లేదని పేర్కొంది.

అయితే సమీపంలో ఆయుధ డిపో లేదని ఉక్రెయిన్ ఖండించింది. క్రెమెన్‌చుక్‌లోని షాపింగ్ సెంటర్‌పై "ఉద్దేశపూర్వక" రష్యా క్షిపణి దాడి చేసిందని ఆరోపించింది. సోమవారం కనీసం 18 మంది మరణించారని పేర్కొంది. క్షిపణులు దాడి చేసినప్పుడు లోపల 1000 మందికి పైగా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు.

షాపింగ్ మాల్‌పై క్షిపణి దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించాలని మిస్టర్ జెలెన్స్కీ ఐక్యరాజ్యసమితికి పిలుపునిచ్చారు. మంగళవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రసంగిస్తూ ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో మరణించిన వారి కోసం ఒక నిమిషం మౌనం పాటించాలని రష్యాతో సహా కౌన్సిల్ సభ్యులకు కూడా పిలుపునిచ్చారు.