Begin typing your search above and press return to search.

రష్యా-ఉక్రెయిన్ వార్: స్వల్ఫ అణు ప్రయోగానికి రెడీ..?

By:  Tupaki Desk   |   26 Jun 2022 10:32 AM GMT
రష్యా-ఉక్రెయిన్ వార్: స్వల్ఫ అణు ప్రయోగానికి రెడీ..?
X
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా రష్యా దుందుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపించిన సోవియట్ దేశం ఇప్పుడు స్వల్ప అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. స్వల్ప శ్రేణి అణుసామర్థ్య క్షిపణులను బెలారస్ కు తరలిస్తోంది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పడం విశేషం. త్వరలో ఆయన బెలారస్ అధ్యక్సుడితో చర్చలు జరపనున్నారు.

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం సుధీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందలో భాగంగా రష్యా క్షిపణులను బెలారస్ కు తరలిస్తోంది. ఇప్పటికే బెలారస్ అధ్యక్సుడు అలెగ్జాండర్ లుకషెంకో సెయింట్ పీటర్స్ బర్గ్ కు చేరుకున్నారు. అక్కడ ఆయనతో మీట్ అయిన పుతిన్ ఆ తరువాత మాట్లాడారు. రానున్న కొన్ని నెలల్లో బెలారస్ కు ఇసికందర్ -ఎం టాక్టికల్ మిసైల్ వ్యవస్థలను అందించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీంతో ఇక ఉక్రెయిన్ పై స్వల్ప శ్రేణి ప్రయోగం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా పుతిన్ అనుకుంటున్న ఇసికందర్ క్లిపణులు బెలారస్ కు చేరాలంటే కలినినిగ్రాండ్ నుంచి వెళ్లాలి. ఈ ప్రాంతం పొలాండ్-లిథువేనియా మధ్యలో ఉంది. ఈ రెండు దేశాలు నాటోలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పటికే రష్యాకు చెందిన ఆయుధాలు తమ దేశం మీదుగా వెళ్లేందుకు నిషేధించింది. కానీ ఇసికందర్ క్లిపణులు ఇటునుంచే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో నాటో దేశాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయోనన్న చర్చ జరుగుతోంది.

మరోవైపు ఇసికందర్ క్షిపణులు ఇప్పటికే బాల్టిక్ ప్రాంతంలోకి కలినినిగ్రాండ్ వరకు వచ్చాయని అంటున్నారు. అయితే తమ క్షిపణులు వెళ్లకుండి నిషేధాన్ని ప్రకటించడంపై బెలారస్ అధ్యక్షుడు విమర్శించారు. ఇలా చేయడం యుద్దాన్ని ప్రకటించడమేనని ఆయన అన్నారు. దీంతో రష్యా క్షిపణులను లిథువేనియా ఏం చేస్తుందోనన్న చర్చ సాగుతోంది. అయితే ఒకవేళ తమ క్షిపణులను లిథువేనియా ధ్వంసం చేసినట్లయితే బెలారస్ లోని సు-25 విమానాలను అణ్వాయుధాలు తీసుకెళ్లేలా అప్ గ్రేడ్ చేస్తామని అంటున్నారు.

ఓ వైపు స్వల్ప అణు ప్రయోగానికి సిద్ధమవుతున్న రష్యా మరోవైపు లుహాన్స్క్ ప్రాంతంలోని సెవిరోదొనెట్స్క్ నగరాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని ఆ నగర మేయర్ వెల్లడించారు. డాన్ బాస్ లోని కీలకమైన రెండు పారిశ్రామిక నగరాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఆ తరువాత రష్యా అణు ప్రయోగంపై దృష్టిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే ఉక్రెయిన్ కు మాత్రం యూరోపియన్ దేశాలు సపోర్టు నిస్తున్నాయి. భారీగా ఆయుధాలు అందిస్తూ పోరాటంలో ఉండేలా చేస్తున్నారు.