Begin typing your search above and press return to search.

రమ్మీకి అడిక్ట్ , ప్రియురాలితో బ్రేకప్ .. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ !

By:  Tupaki Desk   |   10 Aug 2020 5:45 AM GMT
రమ్మీకి అడిక్ట్ , ప్రియురాలితో బ్రేకప్ .. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ !
X
రమ్మీకి అడిక్ట్ , ప్రియురాలితో బ్రేకప్ ... ఆన్ లైన్ గేమ్ కి అడిక్ట్ అయిన ఓ కానిస్టేబుల్ చివరికీ ఆ వ్యసనంలో పూర్తిగా మునిగిపోయాడు. ఉన్న పోలీస్ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసాడు. అలాగే , అదే స్టేషన్ లో పనిచేస్తన్న లేడీ కానిస్టేబుల్ ను ప్రేమించాడు. ఒకవైపు ఆమెతో ప్రేమలో .. మరోవైపు ఆన్లైన్ రమ్మీకి బాగా అడిక్ట్ అయ్యి .. విపరీతమైన అప్పులు చేసాడు. ఇదిలా సాగుతున్న సమయంలోనే ఆ లేడీ కానిస్టేబుల్ తన పెళ్లి కార్డు చేతిలో పెట్టింది. దీనితో మరింతగా రమ్మికి అడిక్ట్ అయ్యి ..ఆ అట ఆడటానికి కూడా డబ్బు లేక , అప్పుల భాదలు తట్టుకోలేక చివరికీ యూనిఫామ్ లోనే ఆత్మహత్య కి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తిరుప్పరరాయతురై సమీపంలోని అసలై గ్రామంలో గోవిందాజ్ అనే ఓ రైతు నివాసం ఉంటున్నాడు. గోవిందరాజ్ కుమారుడు ఆనంద్ డిగ్రీ పూర్తి అయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా కస్టపడి , కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. దీనితో ఆ తల్లిదండ్రులు కూడా ఆనందపడ్డారు. అయితే , ఆనంద్ కి ముందు నుండి స్నేహితులతో కలిసి పేకాట ఆడటం అలవాటు. ఉద్యోగం వచ్చాక కూడా దాన్ని మనుకోలేకపోయాడు. ఈ తరుణంలోనే ఆన్ లైన్ రమ్మికి బాగా అడిక్ట్ అయ్యాడు. ఆన్ లైన్ లో పేకాట ఆడటం, సంపాధించిన మొత్తం జీతం అందులోనే పెట్టేసేవాడు. అది సరిపోకపోవడంతో అప్పులు చెయ్యడం అలవాటు చేసుకున్నాడు. ఉద్యోగం చేస్తున్న పోలీస్ స్టేషన్ లో. ఫ్రెండ్స్, బంధువులు, తెలిసినవాళ్ల దగ్గర ఆనంద్ విపరీతంగా అప్పులు చేసి మొత్తం డబ్బులు పేకాట ఆడేవాడు.

ఆనంద్ ఉద్యోగం చేస్తున్న వాత్తురై పోలీస్ స్టేషన్ లో ఓ యువతి లేడీ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నది. ఆనంద్ సాటి మహిళా పోలీసు మీద మనసు పారేసుకున్నాడు. యువతి ఆనంద్ తో చనువుగా ఉండటంతో ఆనంద్ ఆమెను ప్రేమించాడు. కానీ ,ఆమెకి ఎప్పుడు చెప్పలేదు. అప్పులు ఇచ్చిన వాళ్లు లాక్ డౌన్ సమయంలో డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అదే సమయంలో వచ్చిన జీతం వచ్చినట్లు వడ్డీలు కట్టడానికి సరిపోయింది. ఇంటి నుంచి డబ్బులు తీసుకురావడానికి ఆనంద్ కు వీలుకాలేదు. ఇదే సమయంలో ఇటీవల ఆన్ లైన్ పేకాట ఆడటానికి ఆనంద్ దగ్గర డబ్బులు లేకపోయింది. ఆన్ లైన్ పేకాట ఆడటానికి వీలులేకపోవడంతో చాలా డిప్రెషన్ కి గురైయ్యాడు. ఇదే సమయంలో ఆ లేడీకి పెళ్లి కుదిరింది. తాను నిన్ను ప్రేమిస్తున్నానని ఆనంద్ సాటి లేడీ పోలీసుకు చెప్పాడు. నీది వన్ సైడ్ లవ్, నేను నిన్ను ప్రేమించడం లేదని ఆమె షాక్ ఇచ్చింది. ప్రేమించిన అమ్మాయి దక్కడం లేదని, అప్పులు ఇచ్చిన వాళ్లు తరిగి డబ్బులు చెల్లించానలి ఒత్తిడి చెయ్యడంతో ఆనంద్ కు పిచ్చిపట్టినట్లు అయ్యింది. దీనితో స్టేషన్ నుండి ఇంటికి వెళ్లిన ఆనంద్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. రాత్రి పశువుల పాకలోకి వెళ్లిన ఆనంద్ యూనీఫాంలోనే తల్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వేకువ జామున ఆవుకు పాలు పితకాలని వెళ్లిన తండ్రి గోవిందరాజ్ కొడుకు ఆనంద్ ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య పై విచారణ చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.