Begin typing your search above and press return to search.

మహాతల్లి... ఒకరోజు షాపింగ్‌ కి రూ.70 లక్షలు!

By:  Tupaki Desk   |   2 Jun 2023 10:00 AM GMT
మహాతల్లి... ఒకరోజు షాపింగ్‌ కి రూ.70 లక్షలు!
X
ఆడవారికి మీ "హాబీ" ఏమిటి అని అడిగితే... మెజారిటీ స్త్రీలు, మరి ముఖ్యంగా పట్టణాల్లో స్త్రీలు ఎక్కువగా చెప్పే మాట "షాపింగ్" అని. షాపింగ్ అనేది అవసరం కాస్తా... అలవాటుగా, అదొక వ్యాపకంగా, నిత్యకృత్యంగా మారిపోయిన రోజులివి. అయితే ఇలాంటి స్త్రీల యందు ఈ స్త్రీ వేరయా అన్నట్లుగా ఉంది ఒక దుబాయ్ లో ఓ మహిళ వ్యవహారం. షాపింగ్ మాత్రమే వ్యాపకంగా గడిపేస్తున్న ఈమె గురించి ఒక లుక్కేద్దాం!

ఆడవారికి షాపింగ్ అంటే ఇష్టమే. కాదనే మాటే లేదు. కాదంటే ఇంట్లో "వారు" లేరు! అయితే "షాపింగ్ మాత్రమే" ఇష్టం అన్నట్లుగా గడిపేస్తుంది దుబాయ్ లో ఓ మహిళ. ఆమె ఒకరోజు షాపింగ్ చేస్తే రూ. 70 లక్షలు ఖర్చుపెడుతుందట. మీరు చదువుతున్నది నిజమే...! ఎంత మిలియనీర్ భార్య అయినా మరీ ఇంతనా అంటూ ఆ భర్తను తలచుకుని జాలిపడే ముందు స్టోరీ లోకి వెళ్దాం.

దుబాయ్‌ లో నివాసం ఉంటున్న జమాల్.. ఒక మిలియనీర్. దీంతో అతని భార్య సౌదీకి మూలుగుతున్న కోట్ల డబ్బు ఏం చేయాలో పాలుపోవట్లేదో ఏమో కానీ... ఖర్చు పెట్టడమే పనిగా పెట్టుకుందంట. ఈమె తమ మూడ్‌ ని బట్టి ఇండియన్స్ కరెన్సీ ప్రకారం గరిష్టంగా ఒక రోజులో సుమారు 70 లక్షల రూపాయల షాపింగ్ చేస్తుందంట.

ఇందులో భాగంగా తన చేతుల అందం కోసం తీసుకునే ట్రీట్మెంట్‌ కి రూ. 63,000 ఖర్చు చేస్తుందట. భోజనం చేయాలనిపిస్తే టాప్ రెస్టారెంట్ లో జస్ట్ రూ. 96,000 పెట్టి టేబుల్ బుక్ చేస్తుందంట. మేచింగ్ దుస్తులూ, మ్యాచింగ్ వాచ్ లు, మ్యాచింగ్ హ్యాండ్ బేగ్ లె కాదు... మ్యాచింగ్ కారు లేకపోయినా పాప బయట కు వెళ్లదంట.

మరి ఖాళీగా ఉన్న సమయాల్లో ఏమి చేస్తుంది అని అంటారా? వీలైతే లండన్ ట్రిప్, కుదిరితే మాల్దీవులు టూర్. అక్కడితో ఆగదండోయ్... టిక్‌ టాక్, ఇన్‌ స్టాగ్రామ్‌ లలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న సౌదీ.. ప్రతిరోజు లగ్జరీ గా గడిపిన హాలీడే ట్రిప్స్‌ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది.