Begin typing your search above and press return to search.

300 కోట్ల బంగారంతో హైదరాబాద్ కు.. దొరికాడిలా?

By:  Tupaki Desk   |   25 Jan 2021 4:30 AM GMT
300 కోట్ల బంగారంతో హైదరాబాద్ కు.. దొరికాడిలా?
X
మరో భారీ బంగారం స్కామ్ వెలుగుచూసుంది. హైదరాబాద్ లో ఇది సంచలనంగా మారింది. 2019లో చెన్నై కేంద్రంగా మొదలైన ఈ మోసానికి సంబంధించిన నిందితులను తాజాగా హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో అరెస్ట్ చేశారు.

చెన్నైకి చెందిన రూబీ గోల్డ్ వడ్డీలేని రుణాలు ఇస్తానని భారీగా ఆభరణాలు తీసుకొని దాదాపు 1500 మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రూ.300 కోట్ల విలువైన వెయ్యి కిలోల బంగారాన్ని రూబీ గోల్డ్ యజమాని ఇప్సర్ రెహమాన్ సేకరించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

ఇప్సర్ చాలా చాకచక్యంగా జనాలకు కుచ్చుటోపీ పెట్టాడు. బంగారం విలువకు మూడొంతుల డబ్బు ఇస్తానని మాయమాటలు చెప్పాడు. దీంతో నిమ్మిన 1500 మంది తమ ఆభరణాలను రుణాల కోసం ఇచ్చాడు.

అందరివీ తీసుకున్న అప్సర్ మోసం చేసి అక్కడి నుంచి బిచాణా ఎత్తివేశాడు. హైదరాబాద్ పరార్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఆదివారం నగరంలోని బీహెచ్ఈఎల్ లోని ఓ ఇంట్లో తెలంగాణ, చెన్నై పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇఫ్సర్ తోపాటు ఆయన సోదరుడు, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సోదాల్లో ఏదైనా బంగారం దొరికిందా? కొట్టేసిన బంగారం ఎక్కడ దాచారు? ఏఏ ప్రాంతాల్లో ఇంకా సోదాలు నిర్వహిస్తారనే వివరాలు తెలియాల్సి ఉంది.