Begin typing your search above and press return to search.

రూ.2వేల నోట్లకు గల్ఫ్ దేశాల షాక్ మామూలుగా లేదుగా?

By:  Tupaki Desk   |   30 May 2023 10:03 AM GMT
రూ.2వేల నోట్లకు గల్ఫ్ దేశాల షాక్ మామూలుగా లేదుగా?
X
రూ.2వేల నోటు ను ఉపసంహరించుకున్నట్లుగా ఆర్ బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) చేసిన ప్రకటన గల్ఫ్ దేశాల్లో ని భారతీయుల కు చుక్కలు చూపిస్తోంది. రూ.2వేల నోట్ల ను బ్యాంకులు జారీ చేయొద్దు కానీ.. వాటిని తీసుకోవటం.. బ్యాంకు లో డిపాజిట్ చేసుకోవటానికి అనుమతి ఇవ్వటం తెలిసిందే. అయినప్పటికీ.. అవగాహన రాహిత్యంతో గల్ఫ్ లో మాత్రం రూ.2వేల నోట్ల ను తీసుకోవటానికి ఎక్సైంజీ కేంద్రాలు రిజెక్టు చేస్తున్నాయి.

రూ.2వేల నోట్ల ను తీసుకోవద్దని తమకు పై అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లుగా ఎక్సైంజీ కేంద్రాల్లో ని సిబ్బంది చెప్పటంతో ఏం చేయాలో అర్థంకా ని పరిస్థితి నెలకొందంటున్నారు. నోట్ల మార్పిడి విధానం పై అవగాహన లేకపోవటమే దీనికి కారణంగా చెబుతున్నారు. రూ.2వేల నోట్ల ను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఆర్ బీఐ మే 19న ప్రకటించి.. సెప్టెంబరు 30 వరకు పెద్ద నోట్లను మార్చుకోవచ్చని స్పష్టం చేసింది.

వేసవి సెలవులు కావటంతో గల్ఫ్ దేశాల కు వెళ్లిన భారతీయుల కు చుక్కలు కనిపిస్తున్నాయి. తమతో పాటు తీసుకెళ్లిన రూ.2వేల నోట్ల ను అక్కడ మార్చుకోవటానికి ఒప్పుకోకపోవటంతో ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. సెప్టెంబరు 30 వరకు గడువు ఉందన్న విషయాన్ని ఎక్సైంజీ కేంద్రాల్లో ని సిబ్బందికి చెబుతున్నా.. వారు మాత్రం వినిపించుకోవట్లేదు. వారం క్రితం ఫిరోజ్ షేక్ అనే మహిళ.. భర్తను కలిసేందుకు తన ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయ్ కు వెళ్లారు. ఎప్పటిలానే తన వద్ద ఉన్న రూ.2వేల నోట్ల ను మార్చుకోవటానికి అక్కడున్న ఎక్సైంజీ కేంద్రానికి వెళ్లారు.

అయితే.. వారు ఆమె నుంచి రూ.2వేల నోట్లు తీసుకోవటాని కి నో చెప్పటంతో షాక్ తిన్నారు. సెప్టెంబరు 30 వరకు గడువు ఉన్నట్లుగా చెప్పినా వారు ఒప్పుకోలేదు. దీంతో.. ఆమె భర్త వచ్చే వరకు వెయిట్ చేయక తప్పలేదు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు బోలెడన్ని చోటు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. కష్టాల గురించి సోషల్ మీడియాలో బోలెడన్ని పోస్టులు పెడుతున్నారు.

ప్రస్తుతం సెలవుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో పర్యటించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వేళ.. దేశం కాని దేశంలో రూ.2వేల నోట్ల ను ఎక్సైంజీ కేంద్రాల్లో తీసుకోకపోవటం వల్ల ఎదురయ్యే ఇబ్బందుల్ని గుర్తించి.. కేంద్రం తక్షణమే స్పందించి... ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇలాంటి ఇష్యూల మీద మోడీ సర్కారు వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది.