రూ.1337కోట్లుకట్టాల్సిందే.. గూగుల్ ఇండియాకు భారీ ఫైన్

Thu Mar 30 2023 10:16:34 GMT+0530 (India Standard Time)

Rs. 1337 crores have to be paid.. CCI is a huge punch to Google

గూగుల్ ఇండియా కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. భారీ జరిమానా నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సుప్రీంకోర్టు వరకు చేసిన ప్రయత్నాల్లోనూ గూగుల్ ఇండియా కు ఎదురుదెబ్బే తగిలింది. తాజాగా గూగుల్ కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించిన రూ.1337 కోట్ల భారీ జరిమానాను కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. తాజాగా గూగుల్ ఇండియా కు నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఓఎస్ కు సంబంధించిన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ అవకతవకల కు పాల్పడినట్లుగా గూగుల్ మీద ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసులో సదరు కంపెనీకి రూ.1337 కోట్ల భారీ ఫైన్ విదిస్తూ ఆదేశాల్ని జారీ చేశారు.

దీంతో పాటు ఫోన్ తయారీదారుల పై ఉన్న ఆంక్షల్ని సైతం తొలగించాలని కూడా కోరింది. ఈ అంశంపై గూగుల్ నేషనల్ కంపెనీలా అప్పీలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. అక్కడా ఎదురుదెబ్బే తగిలింది.

దీంతో.. గూగుల్ ఇండియా సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. అయినప్పటి కీ  ఆ సంస్థకు ఎదురుదెబ్బే తగిలింది. జరిమానా మొత్తంలో 10 శాతం మొత్తాన్ని వారం వ్యవధిలో డిపాజిట్ చేయాలని సుప్రీం ఆదేశాల్ని జారీ చేసింది.

అంతేకాదు సీసీఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) గతంలో జారీ చేసిన ఆదేశాల పై గూగుల్ చేసిన వినతి పైనా ఈ నెలాఖరులోపు నిర్ణయం తీసుకోవాల ని పేర్కొంది. మొత్తంగా.. రూ.1337 కోట్ల భారీ మొత్తాన్ని ఫైన్ రూపంలో కట్టక తప్పని పరిస్థితుల్లో గూగుల్ ఇండియా ఉందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.