రోశయ్య అంతిమయాత్ర ప్రారంభం

Sun Dec 05 2021 14:05:35 GMT+0530 (IST)

Roshaiya funeral Begins

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అంతిమయాత్ర ప్రారంభమైంది. తొలుత ఆయన పార్థీవ దేహాన్ని అమీర్ పేటలోని స్వగృహం నుంచి గాంధీభవన్ కు తరలించారు. అక్కడ ప్రజలు అభిమానుల సందర్శనార్థం ఉంచారు.ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా వచ్చిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు.

కాంగ్రెస్ ముఖ్యనేతలు రోశయ్య భౌతికకాయం వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది.

తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో తూంకుంట పురపాలక సంఘం పరిధిలోని దేవరయాంజల్ లోని వ్యవసాయ క్షేత్రంలో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

గాంధీభవన్ నుంచి రోశయ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. రోశయ్య పార్థీవ దేహానికి ఏపీ తెలంగాణమంత్రులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీలు సినీ నటుడు చిరంజీవి నివాళులర్పించారు.