మెడికల్ యజమానితో షాపులో రొమాన్స్.. వారించినా వినని భార్య! భర్త ఏం చేశాడంటే?

Mon Jul 26 2021 08:25:04 GMT+0530 (IST)

Romance with the medical shop owner. What did the husband do?

బంధాలు.. అనుబంధాలకు కొత్త అర్థాలు వచ్చే పరిణామాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. గతానికి భిన్నంగా జరుగుతున్న పరిణామాలతో అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భర్త ఎంత చెప్పినా వినకుండా.. వ్యవహరిస్తున్న భార్య ప్రవర్తనతో విసిగిపోయిన అతగాడు.. అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఒక మెడికల్ షాపు యజమానితో అతడి షాపులోనే తన భార్య సాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేని ఒక వ్యక్తి.. తన భార్యతో రొమాన్సు చేసే వ్యక్తిని నడి రోడ్డు మీద నరికేసిన వైనం పెను సంచలనంగానే కాదు.. షాకింగ్ గా మారింది. వైరల్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..పశ్చిమబెంగాల్ లోని తూర్పు24 పరగణాల జిల్లాలోని అశోక్ నగర్ లో ఈ దారుణం జరిగింది. తన భార్యతో నివాసం ఉంటున్న అపుకహార్ అనే వ్యక్తి. వారి సంసార జీవితం సరిగా సాగుతున్న వేళలో ఆమెకు.. స్థానికంగా ఉండే మెడికల్ షాపు యజమాని మిలాన్ ఘోష్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఇందులో భాగంగా మెడికల్ షాపునకు తరచూ వెళ్లేంది. షాపులోనే వారు దుకాణం పెట్టేసినట్లుగా చెబుతున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త.. భార్యను రెండుమూడు సార్లు తన పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ భార్య మాత్రం అతడ్ని పట్టించుకోకుండా మెడికల్ షాపు యజమానితో సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అపుకహార్.. మెడికల్ షాపు యజమానిని టార్గెట్ చేశాడు. అతడ్ని అంతమొందించేందుకు అతడి వెంట పడ్డాడు. తాజాగా రద్దీగా ఉండే నోట్ని మార్కెట్ కు షాపింగ్ నకు వెళ్లాడు.

మిలాన్ ను వెంబడించిన అపు కహార్.. అందరూ చూస్తుండగానే అతడిపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. అయితే.. ఆవేశంతో దాడి చేస్తున్న అపు కహార్ ను స్థానికులు పట్టుకొని చితకబాదారు. మరోవైపు.. తీవ్ర గాయాలకు గురైన మిలాన్ ను ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్లు వైద్యం అందిస్తున్న సమయంలోనే అతను మరణించాడు. మరోవైపు అపు కహార్ ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. ఈ వైనంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.