Begin typing your search above and press return to search.
శుక్రవారం వచ్చేసింది.. ఈసారి 'సీన్' విశాఖకు షిఫ్టు
By: Tupaki Desk | 14 April 2023 3:21 PM ISTఏపీలో ఇప్పుడో కొత్త పరిస్థితి. గతంలో శుక్రవారం వచ్చిందంటే.. వీకెండ్ కు ముందు రోజుగా మహా ఉత్సాహంగా రెఢీ అయి.. ఈ రోజు సాయంత్రానికి ఏమేం చేయాలన్న ప్లాన్లు వేసుకునే పరిస్థితి. అందుకు భిన్నంగా శుక్రవారం వచ్చిందంటే చాలు ఏపీలో రాజకీయ అలజడి నెలకొంటోంది. శుక్రవారం అయితే చాలు.. ఏదో ఒక కేసుకు సంబంధించి విపక్షాలపై అధికారులు విరుచుకుపడుతున్నారని.. దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నాయన్న ఆరోపణలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
ఇదే విషయాన్ని విపక్ష నేత చంద్రబాబు సైతం తన ప్రసంగాల్లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. శుక్రవారం అయితే చాలు.. ఎవరో ఒకరిని అరెస్టు చేయటం.. రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వాదనకు బలం చేకూరేలా ఘటన ఈ శుక్రవారం ఉదయం మరొకటి చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో కొంత మేర ప్రభుత్వ స్థలంగా గుర్తించినట్లుగా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
నిజానికి గీతం వర్సిటీకి సంబంధించిన భూమి విషయంలో వివాదాలకు సంబంధించి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వినిపిస్తున్న వాదన ఒకలా ఉంటే.. ఈ పేరు మోసిన ప్రైవేటు వర్సిటీ యాజమాన్యం వాదన మరోలా ఉంది. ఇప్పటికే పలుమార్లు ఈ వర్సిటీ భూమికి సంబంధించిన విషయంలోకి రావటం.. కాస్తంత హడావుడిచోటు చేసుకోవటం.. కోర్టు ఆర్డర్ తో సద్దుమణగటం లాంటివి చోటు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
ఈ ఏడాది జనవరిలోనూ గీతం వర్సిటీని ఆనుకొని ఉన్న 14 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ అధికారులు స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. తాజాగా మరోసారి వర్సిటీపై ఫోకస్ పెట్టినట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కంచె నిర్మాణ సామాగ్రితో వర్సిటీలోకి వెళ్లారు. ప్రధాన క్యాంపస్ లోని డెంటల్ కాలేజీ వద్ద కిలోమీటర్ మేరకు కంచెను వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున రెండు గంటల నుంచే గీతం వర్సిటీలోకి వెళ్లే అన్ని రోడ్లపైనా పోలీసులు ఆంక్షలు విధించారు. రెండు కిలోమీటర్ల ముందే బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరినీ వెళ్లనివ్వలేదు. కార్డులు చూపిస్తేనే స్థానికులను అనుమతిస్తున్నారు. దీంతో.. కార్మికులు.. సామాన్యులు ఇబ్బందులకుగురి అవుతున్నారు.