Begin typing your search above and press return to search.

5 హామీలు..: రేవంత్‌ రెడ్డి మినీ మేనిఫెస్టో విడుద‌ల చేసిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   9 Jun 2023 7:04 PM GMT
5 హామీలు..: రేవంత్‌ రెడ్డి మినీ మేనిఫెస్టో విడుద‌ల చేసిన‌ట్టేనా?
X
తెలంగాణ‌ లో అధికారం లోకి రావాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ 5 అంశాల‌ ను ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న కూడా మినీ మేనిఫెస్టో ను దాదాపు విడుద‌ల చేసిన‌ట్టేన‌నే చ‌ర్చ జోరు గా సాగుతోంది. 'అభయ హస్తం' పేరు తో ఐదు ప్రధాన అంశాల తో ప్రజల దగ్గరికి వెళ్తామని తాజాగా రేవంత్ రెడ్డి చెప్పారు. సెప్టెంబర్ 17న మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. పలు పార్టీల నేతల తో అధిష్టానం చర్చలు జరిపిందని, ప్రజలు కోరుకుంటున్న విధంగానే చేరికలు ఉంటాయని, కర్ణాటక ఫలితాలే తెలంగాణ లో రిపీట్ అవుతాయన్నారు.

సీఎం కేసీఆర్‌ కు తన పేరు ప‌లికే దైర్యం ఉందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దమ్మంటే తన పేరు తీయాల ని ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నానన్నారు. గడీల పాలన పునరుద్ధరించడానికి సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చుకున్నారని విమర్శించారు. భూస్వాముల ను తరిమి కొట్టడానికే నక్షల్బరీ ఉద్యమం వచ్చిందని, ధరణి లో పోర్టల్ ప్రభుత్వం చేతి లో లేదని, దళారుల చేతి లోకి పోయిందని అన్నారు. ధరణి లేక పోతే రైతుబందు రాదనడం బుర్ర తక్కువ పని అని మండిపడ్డారు. ధరణి మోసాల వల్ల కేసీఆర్ కుటుంబం చర్లపల్లి జైలుకి వెళ్తుందన్నారు. చర్లపల్లి జైలు లో కేసీఆర్ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామన్నారు.

మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వస్తే బహిరంగంగా చర్చిద్దామని రేవంత్ రెడ్డి అన్నారు ఏ ప్రాజెక్టు విషయంలో నైనా చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు. రెండు వేల రూపాయల కు రెండు ఫుట్ బాటిల్స్ కూడా రావడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే కేసీఆర్ కుటుంబంలా ప్రజలను దోచుకోమని స్పష్టం చేశారు.

సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం పై ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష వేయిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ లో కేసీఆర్‌ ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని యూత్ కాంగ్రెస్‌ కు పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

"త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం మీరంతా కష్టపడాలి. పోరాడే వారికే భవిష్యత్ ఉంటుంది. రాజకీయ భవిష్యత్‌ కు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక. నాయకుడి గా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక వేదిక. 1200 మంది విద్యార్థి, యువత ప్రాణత్యాగా లతో తెలంగాణ ఏర్పడింది. డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని. దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ పని. వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా. బీజేపీ కుట్రల ను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి." అని రేవంత్‌ పిలుపునిచ్చారు.